Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫైనల్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
Adipurush Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించారు. చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారత్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తో పాటు ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామీజీ హాజరయ్యారు. అలాగే ఇటు సినీ ప్రముఖులతో పాటు అటు ప్రభాస్ అభిమానులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
సెకండ్ ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్..
‘ఆదిపురుష్’ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఈ మూవీపై అంచానలు భారీగా పెరిగిపోయాయి. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ లు అందరి ఆకట్టుకున్నాయి. మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల దగ్గరనుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ‘ఆదిపురుష్’ మూవీ కొత్త అప్డేట్ ఉంటుందని ఎదురుచూస్తున్న అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ను అందించింది మూవీ టీమ్. ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించిన ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
రికార్డులు బద్దలుకొట్టేలా ఫైనల్ ట్రైలర్..
అందరూ ఊహించినట్టుగానే ‘ఆదిపురుష్’ సెకండ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. మూవీ నుంచి వచ్చిన ఫైనల్ ట్రైలర్ అదరగొట్టిందనే చెప్పాలి. మూవీ ట్రైలర్ లో విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్ లో ఉన్నాయి. గ్రాఫిక్స్ వర్క్స్ విషయంలో ఈసారి పూర్తి శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ లో లంకేష్ సీతా దేవి దగ్గరకు బిచ్చగాడి రూపంలో వెళ్లి తర్వాత సీతను ఎత్తుకెళ్లిపోయిన సీన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత రాఘవుడు తన భార్యను వెతుక్కుంటూ లంక బయలుదేరడం చూపించారు. తర్వాత రాఘవుడు లంకేష్ తో ఎలా పోరాడిన సన్నివేశాలను చూపిస్తూ ట్రైలర్ ను చాలా బాగా కట్ చేశారు. ముఖ్యంగా రాఘవుడు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా ఈసారి ప్రభాస్ అభిమానులను ‘ఆదిపురుష్’ మంచి విజువల్ ట్రీట్ అనే చెప్పాలి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకట్టుకున్న భారీ సెట్టింగులు..
‘ఆదిపురుష్’ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచీ ఈ మూవీపై భారీ అంచానలే ఉన్నాయి. సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించిన మూవీ టీమ్ సినిమా ప్రమోషన్స్ ల విషయంలోనూ అంతే శ్రద్ధ వహిస్తోంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ స్థాయిలోనే నిర్వహించింది. దాదాపు 2 కోట్లు ఖర్చే చేసి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. కార్యక్రమానికి ముందు కాసేపు వర్షం కురవడంతో అభిమానులు ఆందో ళన వ్యక్తం చేశారు. కానీ తర్వాత వాతావరణం అనుకూలించడంతో ప్రోగ్రాంను అనుకున్న సమయానికే ప్రారంభించారు. స్టేడియంలో వేసిన భారీ సెట్టింగ్ లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వందలాది మంది ఆర్టిస్ట్ ల లైవ్ ప్రదర్శనలు, దాదాపు 50 అడుగుల ప్రభాస్ హోలోగ్రామ్ విగ్రహం, అయోధ్య సెట్టింగ్ లు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ వేడుకకు ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిజీ స్వయంగా హాజరై చిత్ర బృందానికి శుభాశీస్సులు అందజేశారు. ప్రభాస్ అభిమానుల కోలాహలం, జై శ్రీరామ్ నినాదాలతో స్టేడియం ప్రాంగణం అంతా సందడిగా మారింది. మెత్తంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సినిమా జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.