అన్వేషించండి

RC16 : రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాని రిజెక్ట్ చేసిన సీనియర్ నటుడు?

RC16 : రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాని సీనియర్ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి రిజెక్ట్ చేసినట్లు తాజా సమాచారం.

Popular actor rejects Ram Charan-Buchi Babu film : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టు తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో తన 16వ సినిమా చేస్తున్నాడు చరణ్. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లబోతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాని ఓ సీనియర్ నటుడు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాని రిజెక్ట్ చేసిన సీనియర్ నటుడు

'RC16' ప్రాజెక్టులో నటించే నటీనటుల విషయంలో రోజుకో పేరు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కోసం పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తిని  సంప్రదించారట. సినిమాలో ఆ పాత్ర ఎంతో కీలకం కావడంతో ఆ పాత్రకి నారాయణమూర్తి అయితేనే సరిగ్గా సూట్ అవుతారని బుచ్చిబాబు ఇటీవలే ఆయన్ని వెళ్లి కలిశారట. కానీ ఆర్.నారాయణమూర్తి బుచ్చిబాబు ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.  

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఇప్పటి వరకు క్యారెక్టర్ రోల్స్ చేసింది లేదు. గతంలో పూరి జగన్నాథ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'టెంపర్' సినిమా కోసం ఆర్. నారాయణమూర్తిని అనుకున్నారు. పూరి జగన్నాథ్ స్వయంగా ఆయన్ని కలిసి తన పాత్రకు సంబంధించి నెరేషన్ కూడా ఇచ్చారు. కానీ అప్పటికీ ఆయన అంగీకరించకపోవడంతో చివరికి ఆ పాత్ర పోసాని కృష్ణ మురళి దగ్గరికి వెళ్ళింది. 'టెంపర్' లో పోసాని పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. అప్పుడు ఎన్టీఆర్ సినిమాని ఎలా రిజెక్ట్ చేశాడో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాని కూడా నారాయణమూర్తి అలాగే రిజెక్ట్ చేయడం గమనార్హం.

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ 

'దేవర' మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతున్న జాన్వీ కపూర్ రెండవ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉండబోతుంది. బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకి కథానాయిక జాన్వీ కపూర్ ని మూవీ టీమ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి, సమంతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదట.

ఇటీవలే బుచ్చిబాబు జాన్వి కపూర్ కి స్టోరీ నెరేట్ చేయగా, 'RC16' లో భాగం అయ్యేందుకు జాన్వి కూడా అంగీకరించినట్లు తాజా సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

Also Read : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో యశ్? క్లారిటీ ఇచ్చిన టీమ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget