అన్వేషించండి

Yash: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో యశ్? క్లారిటీ ఇచ్చిన టీమ్

Prasanth Varma: యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. అందులో కన్నడ స్టార్ యశ్ కూడా ఉండనున్నట్టు వార్తలు రాగా తన టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Prasanth Varma Cinematic Universe: ప్రస్తుతం అన్ని భాషల పరిశ్రమల్లో సినిమాటిక్ యూనివర్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా తన సొంత సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రకటించాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మొదటి చిత్రం ‘హనుమాన్’ విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. ఇక రెండో చిత్రం ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదే సమయంలో ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో కన్నడ స్టార్ హీరో యశ్ కూడా భాగం కానున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఇది నిజమా కాదా అని క్లారిటీ ఇవ్వడానికి యశ్ టీమ్ ముందుకొచ్చింది.

ఆ పాత్ర ఎవరు చేస్తారు?

‘జై హనుమాన్’ను మరింత భారీ ఎత్తున తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే రివీల్ చేశాడు. ఇందులో హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో ఉండబోతున్నారని కూడా అన్నాడు. ‘హనుమాన్’ చిత్రంలో హనుమంతు పాత్రలో హీరో తేజ సజ్జా కనిపించగా.. ‘జై హనుమాన్’లో కూడా మరోసారి తను అదే పాత్రను పోషించనున్నాడు. ఇక ఈ సినిమా కథ పూర్తిగా హనుమంతుడి చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. అందుకే హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారు అనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కొన్నిరోజులుగా హనుమంతుడి పాత్రలో యశ్ కనిపిస్తాడని వార్తలు వైరల్ అయ్యాయి.

చిరంజీవి పేరు కూడా..

‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారంటూ పలువురు స్టార్ హీరోల పేర్లు ముందుకొచ్చాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ‘హనుమాన్’లో కూడా చిరునే హనుమంతుడిగా కనిపించనున్నారని వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలిపోయింది. అందుకే ‘జై హనుమాన్’లో అయినా ఆయన ఈ పాత్రలో కనిపిస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఆ అవకాశం లేనట్టుగా అనిపిస్తోంది. ఇంతలోనే హనుమంతుడి పాత్రకు యశ్ పేరు బయటికి రావడం అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసింది. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. అలాంటి పాత్ర చేయడానికి యశ్ సిద్ధం లేడని సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా అప్‌కమింగ్ మూవీ ‘టాక్సిక్’పైనే ఉందని అన్నారు.

ఆ విషయంపై క్లారిటీ లేదు..

ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’లో కూడా రావణాసురుడి పాత్రలో యశ్ కనిపించనున్నాడని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ‘రామాయణ్’తో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణాసురుడిగా కనిపించనున్నాడని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం యశ్ అప్‌కమింగ్ సినిమాల్లో ‘టాక్సిక్’, ‘కేజీఎఫ్ చాప్టర్ 3’పై మాత్రమే ఫ్యాన్స్‌లో క్లారిటీ ఉంది. త్వరలోనే ‘రామాయణ్’పై కూడా క్లారిటీ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. 2025లో ఎలాగైనా ఈ మూవీని విడుదల చేయాలని టీమ్ సన్నాహాలు చేస్తోంది.

Also Read: సర్జరీ తర్వాత ఆ వ్యాధితో బాధపడ్డా - ఏడాది పాటు మంచానికే పరిమితమయ్యాను..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget