Priyanka Singh: సర్జరీ తర్వాత ఆ వ్యాధితో బాధపడ్డా - ఏడాది పాటు మంచానికే పరిమితమయ్యాను..
Priyanka Singh: బిగ్‌బాస్ ప్రియాంక తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాలో ఆఫర్ వచ్చిందని, హాట్‌స్టార్‌లో హీరోయిన్‌గా లాంచ్ అవుతున్నానని చెప్పింది.
Bigg Boss Priyanka Singh: ప్రయాంక సింగ్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న ఆమె ట్రాన్స్ జెండర్ అనే విషయం తెలిసిందే. జబర్దస్త్‌లో లేడీ గెటప్‌తో అలరించిన ఆమె ఆ తర్వాత సర్జరీ చేసుకుని పూర్తి అమ్మాయిలా మారిపోయింది. ప్రస్తుతం ఆమె అందానికి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. బిగ్‌బాస్ షోలో తన అందంతో ఆడియన్స్‌ని కట్టిపడేసింది.ఈ క్రమంలో ప్రియాంక లుక్‌కి, అందానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అలా బిగ్‌బాస్‌తో స్టార్ ఇమేజ్ పొందిన ప్రియాంక తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన చిన్నప్పటి రోజుల నుంచి సర్జరీ వరకు ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది.
ఆ డబ్బుతోనే సర్జరీ చేసుకున్నా..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఎందుకో తనకు అబ్బాయిల ఉండటం నచ్చేది కాదని చెప్పింది. "మా అక్క స్కూల్ నుంచి రాగానే తన డ్రెస్సులు వేసుకుని మురిసిపోయేదాన్ని. రానురాను ఆ ఇష్టం మరింత ఎక్కువ అనిపించింది. టెన్త్ క్లాస్‌లో నాకు అర్థమైంది. నేను అబ్బాయిగా కంటే కూడా అమ్మాయిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను అని. దీంతో ఓ రోజు హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ మేకప్ ఆర్టిస్టుగా చేశాను. ఆ తర్వాత జబర్దస్త్‌లో షో లేడీ గెటప్‌లు వేశాను. బయట షోలు చేసేదాన్ని. అలా వచ్చిన డబ్బుతో సర్జరీ చేయించుకున్నాను. ఆ టైంలో విపరీతమైన నొప్పి ఉండేది. ఆస్పత్రిలో ఒంటరిగా ఉన్నాను. పట్టించుకునేవాళ్లే లేరు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఒంటరిగా హైదరాబాద్ వచ్చాను. ఓపక్క రక్తస్రావం అవుతున్నా.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి గేటు వరకు నడుచుకుంటూ వెళ్లాను. బిగ్‌బాస్ షో తర్వాత ఫ్యామిలీ సపోర్టు పెరిగింది. ప్రస్తుతానికి హ్యాపీ. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆసక్తి లేదు.
ఆ చికిత్స తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ జీరో
కొన్ని రోజులకు సర్జరీ నుంచి కోలుకున్నాను. కానీ ఆ తర్వాత ఆర్థరైటిస్‌తో బాధపడ్డాను. దానివల్ల ఏడాది పాటు లేవలేని స్థితిలో మంచానికి పరిమితమయ్యాను. అదే టైంలో 90 కిలోల బరువు పెరిగాను. దానికి చికత్స తీసుకునేసరికి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. బ్యాంక్ బ్యాలేన్స్ జీరో అయ్యింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఒక్కొమెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చింది. అయితే సర్జరీ చేసుకోవాలి అనుకునేవారి కోసం ప్రియాంక సింగ్ ఓ సలహా ఇచ్చింది. అలాంఇ వారు ఖచ్చితంగా హార్మోన్ థెరపీ కూడా చేయించుకోవాలని చెప్పింది. ఇక తన జీవితంలో మూడుసార్లు ఆత్మహత్యయత్నం చేశానంటూ షాకింగ్ విషయం చెప్పింది.
Also Read: బ్యాడ్‌న్యూస్ చెప్పిన హృతిక్ రోషన్ - నిరాశలో తారక్ ఫ్యాన్స్, 'వార్ 2' షూటింగ్‌కి బ్రేక్?
హాట్‌స్టార్‌లో హీరోయిన్‌గా లాంచ్ అవుతున్నా..
"పదో తరగతి అయ్యాక.. ఊర్లో అందరూ ఏదైతే అన్నారో అదే మాట మా నాన్న కూడా అన్నారు. అది తట్టుకోలేకపోయారు. అప్పుడు కిరోసిన్ పోసుకుని కాల్చుకున్నాను. 60 శాతం వరకు శరీరం కాలిపోయింది. దానికి చికిత్స తీసుకున్నాను. తర్వాత లవ్‌లో ఫెయిలైనప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆ బాధ భరించలేక కూడా ఆత్మహత్యయత్నం చేశాను" అని చెప్పింది. అయినా మళ్లీ బతికి బయటపడ్డాను. అంటే నా కోసం ఏదో మంచిది రాసిపెట్టుంది..అందుకే దేవుడు నన్ను మళ్లీ మళ్లీ బతికిస్తున్నాడు అనుకున్నాను. భగవంతుడిని నమ్ముతాను. మందు, సిగరెట్స్ తాగేదాన్ని, కానీ ఇప్పుడు మనేశాను. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నేను ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నానని చెప్పింది. అలాగే హాట్‌స్టార్‌లో హీరోయిన్‌గా లాంచ్ కాబోతున్నానంటూ మురిసిపోయింది. అంతేకాదు తమిళ్‌లో విజయ్ సినిమాలోనూ చాన్స్ వచ్చిందని, వాటితో పాటు మరిన్ని చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తున్నానంటూ చెప్పింది.