మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?
సౌత్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన పూజ హెగ్డే కి కెరియర్ పరంగా గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తుంది. సుమారు రెండేళ్ల నుంచి ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలుస్తున్నాయి. తెలుగులోనే అనుకుంటే బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు కూడా ఆమెకి ఆశించిన స్థాయి సక్సెస్ ని అందించలేకపోతున్నాయి. మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే అందరూ పూజ హెగ్డే పేరునే చెప్పేవారు. స్టార్ హీరోలు సైతం ఏరి కోరి ఈ హీరోయినే కావాలని అనేవారు. కానీ రెండేళ్ల నుంచి పూజ హెగ్డే కెరియర్ చూసుకుంటే ఒక్క హిట్టు కూడా లేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' తర్వాత పూజ హెగ్డే నటించిన ఆరు సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి.
సరే సౌత్ లో ప్లాప్స్ వస్తున్నాయని నార్త్ కు వెళ్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'సర్కస్' మూవీ బాలీవుడ్ లో తొలిరోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుని ఘోరమైన ప్లాప్ ని చవి చూసింది. ఆ తర్వాత ఎంతో కష్టపడి చేసిన సల్మాన్ ఖాన్ 'కీసిక భాయ్ కిసీకా జాన్' సైతం డిజాస్టర్ అయింది. అలా బాలీవుడ్ లో ఈ అమ్మడికి వరుస డిజాస్టర్లు పలకరిస్తున్నా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో రెండు సినిమాలు ఉండగా, తాజాగా బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించబోయే 'కోయి షక్'(Koi Shaq) సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఈ దర్శకుడి సినిమాలకు తిరిగే లేదు. మోహన్ లాల్, దుల్కర్, పృథ్వీరాజ్ లాంటి హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి పూజ హెగ్డే ఇటీవల సైన్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు సినిమాలో షాహిద్ కపూర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, పూజ హెగ్డే పాత్రకి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు.
జి స్టూడియోస్ తో కలిసి సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక టాలీవుడ్లో చూసుకుంటే త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమాలో మొదట పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. రెండు షెడ్యూల్స్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసింది. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమా నుండి హీరోయిన్ గా తప్పుతుంది. ప్రస్తుతం ఆమె స్థానంలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా, రెండవ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని చిత్రయూనిట్ ఎంపిక చేశారు. అయితే గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే హీరోయిన్గా తప్పుకున్నట్లు మూవీ టీం ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అటు పూజ హెగ్డే కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఇప్పటివరకు అధికారికంగా చెప్పింది లేదు.
Also Read : షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial