News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!

'స్కంద' ప్రమోషన్స్ లో భాగంగా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ పోతినేని బాలీవుడ్ స్టార్స్ షారుక్, సల్మాన్ ఖాన్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

FOLLOW US: 
Share:

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'స్కంద'(Skanda) సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడడంతో 'స్కంద' ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే రామ్ తాజాగా స్కంద హిందీ ప్రమోషన్స్ కి హాజరయ్యారు. ఈ ప్రమోషన్ లో రామ్ షారుక్, సల్మాన్ ఖాన్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్ కి తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తే వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే రామ్ కి హిందీలో డబ్బింగ్ చెప్పే సంకేత్ మాత్రే స్కంద ప్రమోషన్స్ లో భాగంగా  ఇంటర్వ్యూ చేశాడు.

ఈ ఇంటర్వ్యూలో సంకేత్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు రామ్. మీ ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఇది? ఎలా అనిపిస్తుంది? అని అడగగా.." చాలామంది రిలీజ్ గురించి అడుగుతున్నారు. ఇది బాలీవుడ్ సినిమా అంటున్నారు. ఒకటి చెప్పాలి స్కంద బాలీవుడ్ సినిమా కాదు! తెలుగు సినిమా. మేము తెలుగులో తీసాం. హిందీ ప్రేక్షకులు నామీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మేం థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమాలు తీస్తాం. యూట్యూబ్, మొబైల్ లో కాకుండా హిందీ ప్రేక్షకులకు కూడా ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని 'స్కంద' ని ప్రపంచం మొత్తంగా విడుదల చేస్తున్నాం" అని రామ్ అన్నాడు.

మీరు ఇటీవల షారుక్ ఖాన్ గారిని కలిసారని విన్నా? షారుక్ ని కలిసినప్పుడు ఎలా అనిపించింది? అని అడిగితే.." అట్లీ, ప్రియ ఇద్దరు నా ఫ్రెండ్స్. నన్ను షారుక్ ఖాన్ ని పరిచయం చేసింది వాళ్లే. నేను షారుక్ సార్ ని కలిసిన దగ్గర నుంచి ఆయన నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. నా సినిమాల గురించి ఇద్దరు మాట్లాడుకున్నాం. స్కంద ట్రైలర్ పంపమని షారుఖ్ సార్ అడిగారు. ఆయన చాలా మంచి వ్యక్తి" అని అన్నాడు రామ్.

అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ని కూడా తాను కలిశానని రామ్ ఈ సందర్భంగా వెల్లడించారు." నేను కలిసిన తొలి హిందీ హీరో సల్మాన్ ఖాన్. నిజానికి నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. రెడీ మూవీలో జెనీలియాతో కలిసి నటించా. నాకు రితిష్, జెనీలియా మంచి ఫ్రెండ్స్. మేము రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ చేస్తున్నాం. భాయ్(సల్మాన్ ఖాన్) వస్తున్నారు అని రితేష్ అన్నారు. అప్పుడు నేను వెళ్తానని చెప్పా. దానికి రితేష్ ఒప్పుకోలేదు, నన్ను పట్టుకుని ఆపాడు. రెడీ మూవీని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు. ఆయనకు నన్ను పరిచయం చేసాక 'గుర్తున్నావు, రెడీలో బాగా చేశావు' అని అన్నారు. మా స్రవంతి మూవీ సంస్థలో నేను చేసిన మొదటి సినిమా రెడీ. అది సల్మాన్ ఖాన్ గారు రీమేక్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది" అంటూ రామ్ పోతినేని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత మాట్లాడుతూ.." ముంబైలో డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ చేస్తున్నప్పుడు నాలుగు నెలల క్రితం వరుణ్ ధావన్ నేను జిమ్ లో కలిసాం. వరుణ్ కూడా చాలా స్వీట్ పర్సన్. హిందీలో నాకు ఒక హీరో ఇష్టమని చెప్పలేను. షారుక్, సల్మాన్, అమీర్, హృతిక్.. అందరు ఇష్టమే. ఈ జనరేషన్ హీరోల్లో రణబీర్ కపూర్ చాలా ఇష్టం" అని బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రామ్. దీంతో రామ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read : నవంబర్ నుంచి మార్చ్ కి షిఫ్ట్ అయిన 'సలార్' రిలీజ్?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 24 Sep 2023 02:39 PM (IST) Tags: Shah Rukh Khan Ram Pothineni Salman Khan Skanda Promotions Ram Pothineni Latest Interview Ram About Sharukh Salaman

ఇవి కూడా చూడండి

Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!

Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!