News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

నవంబర్ నుంచి మార్చ్ కి షిఫ్ట్ అయిన 'సలార్' రిలీజ్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీ రిలీజ్ కి ఏడాది లేనట్లే అని సమాచారం. ఈ చిత్రాన్ని 2024 మార్చి 22న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ రిలీజ్ ఈ ఏడాది లేనట్టేనా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 'సలార్' ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'సలార్' సినిమాని నిర్మిస్తున్న హోంబలే ఫిలిమ్స్ తమ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చిందన్న వార్త ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయిన సలార్ ని నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో విడుదల చేయాలనుకున్న మాట వాస్తవమేనని, అయితే పోటీతోపాటు సోలో రిలీజ్ దక్కే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆ ఒత్తిడిని తీసుకోకుండా వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేయాలని మేకర్స్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారట.

వచ్చే ఏడాది అంటే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన నిర్మాతల దృష్టిలో లేదట. ఎందుకంటే హఠాత్తుగా అనౌన్స్ చేసి మళ్లీ ఆ డేట్ కి రిలీజ్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్ గా 2024 మార్చి 22న 'సలార్' రిలీజ్ డేట్ ని లాక్ చేసే దిశగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డేట్ గత ఏడాది విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్' మూడు రోజుల ముందు విడుదల తేదీ. గత ఏడాది మార్చి 25న 'ఆర్ ఆర్ ఆర్' విడుదలై సంచలన విజయం అందుకుని ఆస్కార్ దాకా వెళ్ళింది. వేసవి సెలవులకు ముందు వచ్చి పిల్లల పరీక్షలు అయిపోయేనాటికీ నిలదొక్కుకుంటే బాక్సాఫీస్ దగ్గర 'సలార్ 'కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం.

అందుకే ఈ ఆప్షన్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సలార్ రిలీజ్ సమస్య కేవలం తెలుగు వర్షం మాత్రమే కాదు. పాన్ వరల్డ్ స్థాయి కాబట్టి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నుంచి కూడా ఎలాంటి క్లాష్ లేకుండా చూసుకోవాలి. అలా చేయకపోతే ఓవర్సీస్ లో ఎక్కువగా స్క్రీన్స్ దొరకవు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేకర్స్  సలార్ సినిమాని వచ్చే ఏడాది మార్చి 22న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ కు సంబంధించి మూవీ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు అక్టోబర్ లో ప్రభాస్ పుట్టిన రోజు నాడు ట్రైలర్ రావడం అనుమానమే అని చెబుతున్నారు.

ఎందుకంటే ఒకవేళ వచ్చే ఏడాది సలార్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే ఇంత ముందుగా ప్రమోషన్ మొదలు పెట్టడం అనవసరం. కాబట్టి ప్రభాస్ పుట్టినరోజు ఏదో ఒక పోస్టర్ తో కమింగ్ ఇన్ 2024 అనే క్యాప్షన్ తో సరి పెడతారేమో. 'ఆదిపురుష్' డిజాస్టర్ ని త్వరగా మర్చిపోవాలని తక్కువ గ్యాప్ లో 'సలార్' వస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయింది. సినిమాకి ఇంకా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఒక విధంగా ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అని చెప్పక తప్పదు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో హోం బలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, పృథ్వీరాజ్ కుమార్ విలన్స్ గా కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : కేరళలో 'లియో' మూవీని బ్యాన్ చేస్తున్నారా? - ట్రెండింగ్ లో #Kerala Boycott Leo?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 24 Sep 2023 01:16 PM (IST) Tags: Salaar Movie Prabhas Prashanth Neel Homble Films Salaar Realese Salaar Realese Date

ఇవి కూడా చూడండి

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి  - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?