కేరళలో 'లియో' మూవీని బ్యాన్ చేస్తున్నారా? - ట్రెండింగ్ లో #Kerala Boycott Leo?
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో' ని కేరళ ఆడియన్స్ బ్యాన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కి సౌత్ ఇండియా వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలను తెలుగులో డబ్ చేసి మెల్లమెల్లగా టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు విజయ్. అటు కేరళలోనూ ఈ హీరోకి మంచి మార్కెట్ ఉంది. అయితే విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ 'లియో'(Leo) మూవీని ఇప్పుడు కేరళ ఆడియన్స్ బాయికాట్ చేసేందుకు సిద్ధమైనట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ట్విటర్ లో మీడియాలో #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
సౌత్ లో భారీ క్రేజ్ తో మోస్ట్ అవైటెడ్ మూవీ గా రాబోతున్న 'లియో' ని ఉన్నట్టుండి కేరళలో బ్యాంక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందుకు అసలు కారణమేంటనేది చాలామందికి తెలియడం లేదు. అయితే తాజాగా అందుకు ఓ కారణం ఉందనే విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియా డిస్కషన్స్ లో భాగంగా కేరళలోని కొందరు మోహన్ లాల్ అభిమానులు, విజయ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ స్టార్స్ ఇద్దరు కలిసి నటించిన 'జిల్లా' చిత్రంలో విజయ్ నటన మోహన్ లాల్ ముందు తేలిపోయిందని మోహన్ లాల్ ఫ్యాన్స్ అన్నారు. అది కాస్త తమిళ విజయ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. దీంతో వాళ్లు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు.
"KERALA BOYCOTT LEO " Tag Participants are Most of Ajith & Rajini - Surya Fans. Undoubtedly We can Say these Fandoms are the Curse Of Kollywood! Jealous On Thalapathy Vijay's Growth 💯 pic.twitter.com/CielcTaApq
— Siddarthツ🦁 (@TheCulpritVJ) September 23, 2023
మోహన్ లాల్ నటన చాలా చిత్రాల్లో చెత్తగా ఉందంటూ క్లిప్స్, ఫోటోలు షేర్ చేయడం మొదలెట్టారు. దీన్ని విజయ్ ఫ్యాన్స్ కొందరు ఓ ఉద్యమంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో మోహన్ లాల్ ఫ్యాన్స్ 'మా మోహన్ లాల్ నే అంటారా? మా కేరళలో మీ హీరో సినిమా ఆడనివ్వమంటూ' #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక దాన్ని విజయ్ యాంటీ ఫ్యాన్స్ షేర్ చేయడం, రీట్వీట్ చేయడం మొదలెట్టారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో #Kerala Boycott Leo అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇక 'లియో' విషయానికి వస్తే.. 'విక్రమ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
అలాగే విజయ్ - లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ ప్రముఖుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే విడుదలకు ముందే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.200 కోట్ల పైన జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని ఫ్యాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే అన్ని భాషల్లో ప్రమోషన్స్ ని సైతం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
Also Read : రామచందర్ తో పరిచయం ఉన్న మాట వాస్తవమే - కానీ నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు : నవదీప్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial