పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ అప్డేట్ వైరల్ గా మారింది. త్వరలోనే ఆయన ఇన్ స్టాగ్రామ్ లో జాయిన్ కానున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు
Power Star Pawan Kalyan : స్టార్ యాక్టర్, పొలిటికల్ లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ పక్క రాజకీయాల్లో ఉంటునే.. మరో పక్క లైనప్ లో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. బ్రో, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు, పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వెలువడింది. పవన్ కళ్యాణ్ తన అభిమానులు, ఫాలోవర్లు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ కావడానికి త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ కానున్నట్లు పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగ బాబు అధికారికంగా ధృవీకరించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ డెబ్యూ తేదీ ఇంకా వెల్లడి కాలేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మామూలుగానే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఓ పక్క రాజకీయంగా, మరో పక్క సినిమాల పరంగా ఆయన ఇటీవలి కాలంలో మరింత పేరును తెచ్చుకున్నారు. ఇటీవలే వారాహి యాత్రను ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతానికి స్వల్ప విరామం ప్రకటించారు. ఇక తాజాగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాలోకి రానున్నారన్న వార్త తెలిసిన పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రోజులో సగానికి పైగా మొత్తం ఇన్ స్టాలో గడిపే యూత్... పవన్ కూడా జాయిన్ అవబోతున్నారని తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం బ్రో, జూలై 28, 2023న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నిర్మిస్తుండగా.. ఈ మూవీకి సముద్రఖని దర్శకుడిగా వ్యవహరించారు. సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఇక హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ పక్కన నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇటీవల లీక్ అయ్యాయి. నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ చిత్రాల్లో ఓ క్లబ్ లో పవన్ కల్యాణ్ ను చూసి అమ్మాయిలు హుషారుగా కేరింతలు కొడుతున్న పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో పాటు సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కేతిక శర్మ ఉన్న షూటింగ్ లొకేషన్ ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఈ పిక్ చూస్తుంటే కేతిక శర్మను సాయి తేజ్ టీజ్ చేస్తున్నట్లుగా ఉంది. వినోదయ సీతమ్ అనే తమిళ సినిమా రీమేక్ గా వస్తోన్న ఈ మూవీని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్ డేట్స్ మూవీపై హైప్ ను పెంచేస్తున్నాయి.
Read Also : Runner: యాక్షన్ హీరోగా మారిన స్టార్ కొరియోగ్రాఫర్ - జానీ మాస్టర్ హీరోగా రెడీ అవుతున్న ‘ రన్నర్’!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial