Runner: యాక్షన్ హీరోగా మారిన స్టార్ కొరియోగ్రాఫర్ - జానీ మాస్టర్ హీరోగా రెడీ అవుతున్న ‘ రన్నర్’!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రన్నర్' ఫస్ట్ లుక్ విడుదల అయింది.
Runner First Look: తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కథానాయకుడిగా మారారు. 'రన్నర్' అనే పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్‌తో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. విజయ ఢమరుక ఆర్ట్స్ బ్యానర్‌పై గతంలో 'అరవింద్ 2' అనే సినిమాను నిర్మించిన విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రన్నర్’ ద్వారా విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదివారం జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
జానీ మాస్టర్ ఫస్ట్ లుక్ సస్పెన్స్
తండ్రీ కొడుకుల అనుబంధం, పోలీసు నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నామని చిత్ర బృందం తెలియజేసింది. 'రన్నర్' ఫస్ట్ లుక్‌ను గమనిస్తే చూస్తే ఖాకీ ప్యాంట్ వేసిన జానీ మాస్టర్‌ను చూడవచ్చు. కానీ షర్టులో మాత్రం వేరియేషన్ చూపించారు. ఒకవైపు ఖాకీ ఉంటే, మరోవైపు ఖద్దరు ఉంది. ఫస్ట్‌లుక్ అలా ఎందుకు డిజైన్ చేశారు? జానీ మాస్టర్ ఎవరికి నమస్తే పెడుతున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు.
ఈ సినిమాపై దర్శకుడు విజయ్ చౌదరి మాట్లాడుతూ ‘మా హీరో, డ్యాన్సింగ్ స్టార్ జానీ మాస్టర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనతో సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. జానీ మాస్టర్ నటన, ఆయన క్యారెక్టరైజేషన్, కథలో తండ్రి కుమారుల మధ్య సెంటిమెంట్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్ అవుతాయి. ఇదొక డిఫరెంట్ తరహా థ్రిల్లర్ సినిమా. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు. ఆయన ట్యూన్లకు జానీ మాస్టర్ స్టెప్పులు అదిరిపోతాయి. ఇతర నటీనటులు, మిగతా వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తాం.’ అన్నారు.
చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి మాట్లాడుతూ ‘జానీ మాస్టర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. దర్శకుడు విజయ్ చౌదరి ఎంతో మంచి కథ రాశారు. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా క్లారిటీతో చేశారు. హైదరాబాద్ నగరంలో కొన్నాళ్ళ క్రితం జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేశాం.’ అని చెప్పారు.
జానీ మాస్టర్ హీరోగా నటిస్తున్న 'రన్నర్' చిత్రానికి పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఛాయాగ్రహణం : పి.జి. విందా, సంగీతం : మణిశర్మ, నిర్మాణ సంస్థ : విజయ ఢమరుక ఆర్ట్స్, నిర్మాతలు : విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : విజయ్ చౌదరి.
Need all your blessings & love in this new journey 🙏🏼#Runner is an exciting Action Thriller based on true events. Hope y'all love it 😇❤
— Jani Master (@AlwaysJani) July 2, 2023
December 2023 Release 💥
🤠 #VeejayChoudary
🎹 #ManiSharma
🎥 @pgvinda
💰 Vijaya Bhaskar, G. Phaneendra, M.Sri Hari
💸 #VijayaDamurukaArts pic.twitter.com/AaxChSLwUn
Join Us on Telegram: https://t.me/abpdesamofficial