Vijay Sethupathi: 'నన్ను నేను చాలా మిస్ అవుతున్నా'.. ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఎమోషనల్
విజయసేతుపతి.. విలక్షన నటుడు. ఎన్నో మంచి మంచి సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లు వేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ అందిరనీ ఆలోచింపచేసింది.
Vijay Sethupathi says he misses his past life as ‘innocent’ young man: విజయ్ సేతుపతి.. పరిచయం అక్కర్లేని పేరు. తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఈయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. కారణం, ఆయన యాక్టింగ్. క్యారెక్టర్ ఏదైనా తనదైన శైలీలో నటిస్తారు విజయ్ సేతుపతి. ఎన్నో హిట్ సినిమాలు, డిఫరెంట్ సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే, ఆయనకు ఆ సక్సెస్ అంత ఈజీగా మాత్రం రాలేదు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి ఈ స్టేజ్ కి వచ్చాడు. విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' సినిమా ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆసినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సుహాస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఎమోషనల్ అయ్యారు. ఆయన మాటలు విన్న ప్రేక్షకులంతా కూడా ఎమోషనల్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే?
'నన్ను నేను మిస్ అవుతున్నాను'..
"మీ లైఫ్ లో మీరు ఏం మిస్ అవుతున్నారు?" అని సుహాస్ అడిగిన ప్రశ్నకి విజయ్ సేతుపతి అందరినీ ఆలోచింపజేసే సమాధానం ఇచ్చాడు. “నన్ను నేను మిస్ అవుతున్నాను. అప్పట్లో ఒక అబ్బాయి ఉండేవాడు చాలా అమ్మాయికుడు. ఎలాంటి కలలు లేకుండా ఉండేవాడు. జీవితంలో ఏం చేయబోతున్నాడో తెలియదు. కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు రెండో ఏడాది సిలబస్ ఏంటో తెలీదు. స్పోర్ట్స్ లో, చదువులో రెండు విషయాల్లో వెనకబడి ఉంటాడు. కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. చాలా సిగ్గు. అందుకే కనీసం అమ్మాయిలతో మాట్లాడేవాడు కాదు. లైఫ్ లో సెటిలవ్వాలి అనుకునేవాడు. కానీ ఎలా సెటిలవ్వాలో తెలీదు. గోల్ మాత్రం ఒక్కటే.. పేదరికం నుంచి బయటపడాలి. అంతటి అమాయకుడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే. నన్ను నేను చాలా మిస్ అవుతున్నాను” అంటూ తన గురించి చెప్పారు విజయ్ సేతుపతి.
సక్సెస్ అంత ఈజీగా రాలేదు..
విజయ్ సేతుపతికి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి ఆయన. గతంలో క్యాషియర్ గా, సేల్స్ మెన్, ఫోన్ బూత్ ఆపరేట్ గా చేశాడు ఆయన. డిగ్రీ తర్వాత హోల్ సేల్ సిమెంట్ బిజినెస్ లో చేరి, అక్కడ నుంచి దుబాయ్ వెళ్లారు. అక్కడ పని నచ్చక ఇండియాకి తిరిగి వచ్చేశాడు. 2003లో ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత మార్కెటింగ్ కంపెనీలో కూడా పనిచేశాడు. “ ఒక వేళ నా బిజినెస్ బాగా సాగి ఉంటే నేను సినిమా యాక్టర్ అయ్యేవాడినే కాదు” అని ఫోర్బ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు విజయ్ సేతుపతి.
అనుకోకుండా యాక్టర్ అయిపోయాను..
తాను అనుకోకుండా, తెలియకుండానే యాక్టర్ అయిపోయానని చెప్పారు విజయ్ సేతుపతి. అన్ని బిజినెస్ లు చేసి, ఉద్యోగాలు చేసిన తర్వాత ఒక థియేటర్ల కంపెనీలో అకౌంటెంట్ గా చేరిన విజయ్ సేతుపతి అక్కడ వేసే నాటకాలు చూసి తాను యాక్టర్ అయితే బాగుండు అనుకున్నారట. “ నాకు జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవు. ఏం చేయాలో ఒకరి డైరక్షన్ లేదు. కేవలం ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి. నా అప్పులు తొందరగా తీర్చుకోవాలి అని మాత్రమే ఉండేది. కానీ అనుకోకుండా యాక్టర్ అయిపోయాను” అని చెప్పారు విజయ్ సేతుపతి.
అలా యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించిన ఆయనకు అనుకోకుండా ఒక టెలీ సీరియల్ లో ఆఫర్ వచ్చింది. దానికి ఒక రోజుకి రూ.5వేలు ఇచ్చేవారు. అలా తను తమిళ్ సీరియల్ యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడట. 2006 వరకు నటించారు. ఆ తర్వాత తన క్యారెక్టర్ క్లోజ్ చేశారట. అలా సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చిన విజయ్ సేతుపతి కెరీర్ లో తెన్మెర్కు పరువకాట్రూ సినిమాతో ఫేమస్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఆయన పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు. తన కెరీర్ లో దీ బెస్ట్ సినిమాలు ఇస్తూ, అభిమానులను సంపాదించుకున్నారు.
Also Read: 'ఓ మంచి గోస్ట్' ట్రైలర్.. ఆ పిల్లే అందరినీ చంపేస్తుందట!