అన్వేషించండి

OMG (O Manchi Ghost) Trailer:'ఓ మంచి గోస్ట్' ట్రైల‌ర్.. ఆ పిల్లే అంద‌రినీ చంపేస్తుంద‌ట‌!

ప్ర‌స్తుతం హారర్ కామెడీ ట్రెండ్ న‌డుస్తోంది ఇండ‌స్ట్రీలో. ఆ జోన‌ర్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు 'ఓ. ఎమ్. జి (ఓ మంచి గోస్ట్)' తో మ‌రో సినిమా రాబోతుంది. ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది.

OMG (O Manchi Ghost) Trailer Released: నిజానికి హార‌ర్ సినిమాలు అంటే చాలా భ‌య‌ప‌డేవారు ఒక‌ప్పుడు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి పోయింది. కార‌ణం హార‌ర్ కి కామెడీని జోడిచేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో ఆ ట్రెండే న‌డుస్తోంది. 'కాంచ‌న' సినిమా మొద‌లుకుని ఇలాంటి సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఇటీవల 'గీతాంజ‌లి', 'గీతాంజ‌లి - 2'తో పాటు మరెన్నో సినిమాలు ఈ జోన‌ర్ లో వ‌చ్చాయి.  ఇప్పుడు  అదే జోనర్ లో 'ఓ. ఎమ్. జి (ఓ మంచి గోస్ట్)' సినిమా కూడా రాబోతోంది. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైల‌ర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. వెన్నెల కిశోర్ తో పాటు ష‌క‌ల‌క శంక‌ర్, నందిత శ్వేత త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. 

ఆ అమ్మాయే అంద‌రినీ చంపుతుంద‌ట‌!

"ఆ కోట‌లో ఒక అమ్మాయిని ఎవ‌రో చంపేశార‌ట‌. ఆ అమ్మాయే ద‌య్యం అయ్యి అంద‌రినీ చంపేస్తుంద‌ని మాట్లాడుకుంటారు అంద‌రూ" అంటూ.. ఒక కోట‌లో ద‌య్యాని చూపిస్తూ ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. క‌ట్ చేస్తే.. న‌లుగురు స్నేహితులు డ‌బ్బులు సంపాదించాల‌ని ప్లాన్ చేస్తుంటారు. "అంద‌రి ప్రాబ్ల‌మ్స్ వేరే ఉన్నా సొల్యూష‌న్ ఒక‌టే అదే డ‌బ్బు. మీరంతా ఓకే అంటే నా ద‌ర‌గ్గ‌ర ఒక మాస్ట‌ర్ ప్లాన్ ఉంది" అంటూ న‌లుగురు స్నేహితులు ఎక్క‌డికో త‌యార‌వుతారు. దేవుడి వేషాలు వేసుకుని ఒక పాత కారులో బ‌య‌లుదేర‌తారు. అంతా బాగానే ఉంటుంది అప్పుడే ఒక పెద్ద కోట‌, దానిపై ద‌య్యం ఉన్న‌ట్లు చూపిస్తారు. న‌లుగురు స్నేహితులు పిశాచిపురం అనే బోర్డ్ ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌తారు. అప్పుడు ష‌క‌ల‌క శంక‌ర్ "ఇదేఊరో తెలుసా?"  పిశాచ‌పురం అని భ‌యంగా అంటాడు. "ఇక్క‌డ పిశాచులు ఉంటాయి" అంటాడు. కానీ, ఎవ్వ‌రూ విన‌కుండా ఆ కోట‌లోకి వెళ్తారు. ఇక అక్క‌డ నుంచి మొద‌ల‌వుతుంది అస‌లు క‌థ‌. 

వాళ్ల‌ను ఆ దేవుడే కాపాడాలి.. 

ట్రైల‌ర్ ని చూస్తే ఈ సినిమా మొత్తం కోట‌లోనే జ‌రుగుతున్న‌ట్లు అర్థం అవుతుంది. ఆ కోట‌లోనే కామెడీ కూడా మొద‌ల‌వుతుంది. "నేను మెజీషియ‌న్ అబ్ర‌క ద‌బ్ర" అనుకుంటూ వెన్నెల కిశోర్ ఎంట‌ర్ అయిన ద‌గ్గ‌ర నుంచి కామెడీ మొద‌లైంది. అప్పుడే "కోట్లు కావాలి.. 20 కోట్లు కావాలి" అంటూ విల‌న్ ఎంట్రీ ఇస్తాడు. కొన్ని హారర్ సీన్లు పెట్టారు. ద‌య్యాలు, ష‌క‌ల‌క శంక‌ర్, వెన్నెల కిశోర మ‌ధ్య కొన్ని ఫ‌న్నీ సీన్లు పెట్టారు. 

"ఇప్ప‌టి వ‌ర‌కు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు. వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం" అంటూ రెండు ఆడ‌ద‌య్యాలు మెట్లు దిగొస్తున్న సీన్ తో సినిమాలో సీరియ‌స్ నెస్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ఉన్నారు. ఇక ఆ త‌ర్వాత ద‌య్యాల‌ను బంధించేందుకు పూజ‌లు చేయ‌డం లాంటివి చూపించారు. ఇప్ప‌టికి ఈ జోన‌ర్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి. అయితే, ఈసినిమా కూడా రొటీన్ గా ఉన్న‌ట్లు అనిపిస్తుంది ట్రైల‌ర్ ని చూస్తే. అన్ని సీన్లు వేరే సినిమాల్లో ఉన్న‌ట్లుగానే అనిపిస్తుంది. సినిమా మొత్తం చేస్తే కానీ ఏదైనా తేడా ఉండేమో అర్థం కాని ప‌రిస్థితి. 

ఓ.ఎమ్.జి లో వెన్నల కిశోర్, ష‌క‌ల‌క శంక‌ర్, నందిత శ్వేత‌, న‌వ‌మీ గాయ‌క్, న‌వీన్ నేని, రాజ‌త్ రాఘ‌వ‌, ర‌ఘుబాబు, నాగినీడు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాకి శంక‌ర్ కే. మార్తాండ్ డైరెక్ట‌ర్. మార్కెట్ నెట్ వ‌ర్క్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై డాక్ట‌ర్ అభినిక ఐన‌బ‌త్తుని నిర్మించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. 

Also Read: 'డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది - 'పుష్ప 2' విడుదలపై కన్నేసిన పూరీ, బన్నీ తప్పుకున్నాడా?

టాప్ హెడ్ లైన్స్

Saripoyaru Iddaroo: 'శతమానం భవతి' దర్శకుడి కొత్త సినిమా... టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
'శతమానం భవతి' దర్శకుడి కొత్త సినిమా... టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
Dada Movie Update : దాదా సెట్స్‌లో బాలయ్య - గాయం తర్వాత కీలక సీన్స్ షురూ
దాదా సెట్స్‌లో బాలయ్య - గాయం తర్వాత కీలక సీన్స్ షురూ
Maremma OTT: రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Romantic Movie OTT : ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget