Double iSmart: 'డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది - 'పుష్ప 2' విడుదలపై కన్నేసిన పూరీ, బన్నీ తప్పుకున్నాడా?
Double iSmart: పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ కమర్షియల్ సినిమానే ‘డబుల్ ఇస్మార్ట్’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Double iSmart Release Date: ఒక్క పాన్ ఇండియా సినిమా రేసు నుండి తప్పుకుంటే అదే తేదీని లాక్ చేసుకోవడానికి మరెన్నో సినిమాలు పోటీపడతాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన రిలీజ్ డేట్.. ఆగస్ట్ 15. ముందుగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ఆగస్ట్ 15న విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆలస్యం లేకుండా ఆ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకోవడానికి ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా దూసుకొచ్చింది.
పోస్ట్‌పోన్ అయినట్టేనా?
పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఏదో ఒక అప్డేట్‌ను విడుదల చేస్తోంది మూవీ టీమ్. అందులో భాగంగానే టీజర్, సాంగ్‌ను విడుదల చేసింది. కానీ ఇంతవరకు ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఆగస్ట్ 15న ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల కానున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ‘పుష్ప 2’ మూవీ పోస్ట్‌పోన్ అవ్వడం కన్ఫర్మ్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ ఈ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
విడుదలకు రెడీ..
రామ్, పూరీ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. చాలాకాలం పాటు సక్సెస్ కోసం ఎదురుచూసిన రామ్, పూరీ జగన్నాధ్‌లకు ఆ మూవీ సక్సెస్‌ను అందించింది. అందుకే దానికి సీక్వెల్ తెరకెక్కించాలని వారు అప్పుడే నిర్ణయించుకున్నారు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ను ప్రారంభించారు. తన ఇతర చిత్రాలలాగానే ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్‌ను కూడా శరవేగంగా పూర్తిచేసిన పూరీ.. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమాలు..
ఆగస్ట్ 15 అనేది పబ్లిక్ హాలిడే. అంటే దాదాపు ఇది లాంగ్ వీకెండ్ లాంటిదే. అలాంటి లాంగ్ వీకెండ్ సమయంలో ఒక ప్యాన్ ఇండియా మూవీని రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ఓ రేంజ్‌లో వస్తాయని చాలామంది మేకర్స్ అంచనా వేస్తారు. అందుకే పక్కా ప్లానింగ్‌తో ఈ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నారు ‘పుష్ప 2’ మేకర్స్. ఫైనల్‌గా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోందని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఈ మూవీ ఆగస్ట్ 15న కూడా విడుదల కావడం లేదని టాలీవుడ్‌లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే ఆ విడుదల తేదీ కోసం ‘డబుల్ ఇస్మార్ట్’తో పాటు మరిన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి.
Also Read: ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ విడుదల - ఇది అందరికీ తమ చిన్నతనాన్ని గుర్తుచేసే సినిమా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

