Theatrical Releases : ‘మంత్ ఆఫ్ మధు’ To ‘మామా మశ్చీంద్ర’- ఈ వారం పెద్ద హిట్ కొట్టే చిన్న సినిమా ఏదో?
ఎప్పటిలాగే ఈవారం కూడా పలు సినిమాలు థియేటర్లలో అలరించనున్నాయి. అయితే, ఈసారి అన్నీ చిన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా పెద్ద హిట్ అందుకుంటుందో చూడాలి.
ఈ వారం టాలీవుడ్ లో చిన్న సినిమాల సందడి కనిపించబోతోంది. సరికొత్త జోనర్లలో వస్తున్న ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాయి. బాక్సాఫీస్ ముందు రాబోతున్నట్లు ఈ సినిమాల్లో ఏది పెద్ద హిట్ అందుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు రెడీ అయిన సినిమాల్లో కొన్నింటికి మంచి బజ్ ఉంది. ఇంతకీ ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
1.‘మంత్ ఆఫ్ మధు’
కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర లీడ్ రోల్ లో కల్ట్ లవ్ స్టొరీగా ఈ చిత్రం తెరకెక్కింది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా మూవీ మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
2.‘మ్యాడ్’
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ రెడ్డి కీలక పాత్రల్లో కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘మ్యాడ్’. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థలు కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. యూత్ ఫుల్ స్టోరీతో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
3.’మామా మశ్చీంద్ర’
సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటించిన చిత్రం ’మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. అయితే, చిత్రబృందం ఎందుకో పెద్దగా ప్రమోషన్ చేయడంలేదు. ఈ నేపథ్యంలో సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కాబోతోంది.
4.’రూల్స్ రంజన్’
కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న తాజా చిత్రం 'రూల్స్ రంజన్'. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జోడీ ప్రేక్షకులను ఇప్పటికే బాగా ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'రూల్స్ రంజన్' సినిమాను నిర్మించింది. ఆయన తనయుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
5.’800’
శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం ‘800’. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. దర్శకుడు ఎంఎస్ శ్రీపతి. ఈ మూవీ అక్టోబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాపైన కొంత హైప్ ఉన్నా కూడా తెలుగులో ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందుతుంది అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు, ఈ శుక్రవారం విడుదలయ్యే చిన్న సినిమాల్లో ఏది పెద్ద విజయాన్ని అందుకుంటుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
Read Also: 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial