(Source: Poll of Polls)
NTR: నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
Kantara Chapter 1 Pre Release Event: సిల్వర్ స్క్రీన్‌పై 'కాంతార'తో రిషబ్ శెట్టి అద్భుతం చేశారని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశంసించారు. చిన్నప్పటి కథలను వెండి తెరపై చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.

NTR About Kantara Chapter 1 In Pre Release Event: తాను చిన్నప్పుడు అమ్మమ్మ నోటి నుంచి విన్న కథలను 'కాంతార' రూపంలో సిల్వర్ స్క్రీన్‌పై రిషబ్ శెట్టి నిజం చేశారని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ వేదికగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన రిషబ్, 'కాంతార చాప్టర్ 1' టీంపై ప్రశంసలు కురిపించారు.
అమ్మమ్మ ఊరి కథలు
తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తన అమ్మమ్మ ఊరి కథలు చెప్పేవారని... అలాంటి కథలతో 'కాంతార'ను తెరకెక్కించి రిషబ్ శెట్టి అద్భుతం చేశారని అన్నారు ఎన్టీఆర్. 'నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మమ్మ కుందాపుర సమీపంలోనే మన ఊరు అని చెప్పేది. అప్పటి కథలు నాకు చాలా నచ్చేవి. 'ఇలా నిజంగానే జరుగుతుందా?' అని ఎన్నో సందేహాలు నాకు వచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా నాకు చాలా బాగా అనిపించేది. ఒక్కసారి ఈ గుళిగ అంటే ఏంటి?, పుంజుర్లి అంటే ఏంటి? అని తెలుసుకోవాలని అనిపించేది.
ఏ రోజు అనుకోలేదు. నేను విన్న ఆ కథల గురించి ఓ దర్శకుడు ఓ మూవీ తీస్తాడని. అది నిజం చేశారు నా సోదరుడు రిషబ్ శెట్టి. 'కాంతార'ను చూసి నాకు నోట మాట రాలేదు. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ గురించి తెలియని వారు ఏమయ్యారో? అదే కాంతార రిజల్ట్. నేను చిన్నప్పుడు విన్న కథలను సిల్వర్ స్క్రీన్‌పై చూసి ఆశ్చర్యపోయా. దాని గురించి మాటల్లో చెప్పలేను. రిషబ్ సార్ 24 కళల్లో ప్రతీ విభాగాన్ని డామినేట్ చేస్తారు. ఇండియన్ సినిమాల్లో కాంతార చాప్టప్ 1 బ్లాక్ బస్టర్ అవుతుంది.' అంటూ ఆకాంక్షించారు.
ఎన్టీఆర్‌తో ఉంటే బ్రదర్ ఫీలింగ్
'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌కు థాంక్స్ చెప్పారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. 'ఎన్టీఆర్ గారు నాకు ఫ్రెండ్, బ్రదర్. ఆయనతో ఉన్నప్పుడు నాకు బ్రదర్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ వేడుకకు ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఆడియన్స్‌కు హృదయపూర్వక నమస్కారాలు. అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 చూసి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.
మూవీలో అద్భుతమైన రోల్ ఇచ్చినందుకు రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్‌కు థాంక్స్ చెప్పారు హీరోయిన్ రుక్మిణి వసంత్. 'తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్స్. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ గారికి థాంక్స్. ఈ మూవీని అక్టోబర్ 2న థియేటర్లలో అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా.' అని అన్నారు.
ఈ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో చాలా పెద్ద నెంబర్స్ కలెక్ట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి అన్నారు. 'హోంబలే ఫిల్మ్స్ అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ గారితో చేస్తున్న సినిమా వేరే లెవల్.' అంటూ చెప్పారు.





















