Thaman: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' హుక్ స్టెప్స్ - ఆ విషయంలో అపార్థం చేసుకున్నారంటూ తమన్ రియాక్షన్... ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ
Ram Charan: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' విషయంలో తాను ఒక ఉద్దేశంతో అంటే కొందరు వేరేగా అర్థం చేసుకుని ప్రచారం చేశారంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Thaman About Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్‌పై ఇటు ఇండస్ట్రీ, అటు సోషల్ మీడియాలో అనేక వాదనలు వినిపించాయి. మ్యూజిక్ లెజెండ్ తమన్ సైతం 'అభిమానులను ఆకట్టుకునేలా హుక్ స్టెప్స్ లేకపోవడమే ఫెయిల్యూర్‌కు కారణం' అంటూ అప్పట్లో కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా... దీనిపై తమన్ రియాక్ట్ అయ్యారు. తాను ఒకటి అంటే కొందరు దాన్ని వేరేలా అర్థం చేసుకుని ప్రచారం చేశారంటూ క్లారిటీ ఇచ్చారు. చరణ్, తాను ఎప్పుడూ స్నేహంగా ఉంటామని... ఉద్దేశ పూర్వకంగానే కొందరు నెగిటివ్ ప్రచారం సృష్టించారని చెప్పారు.
అదే నా బాధ
పాటల్లో హుక్ స్టెప్స్ ట్రెండ్ అవుతూ రీల్స్‌కు బాగా ఉపయోగపడతాయని చెప్పారు తమన్. 'రీసెంట్‌గా వచ్చిన 'కోర్టు' మూవీలో 'కథలెన్నో చెప్పారు. కవితల్ని రాశారు' పాట బాగా ట్రెండ్ అయ్యింది. అది సినిమాకు చాలా కీలకం. ఆ సాంగ్‌లో హుక్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ సాంగ్‌లోనూ బన్నీ వేసిన హుక్ స్టెప్ ఎంతో ప్రభావం చూపింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సింపుల్ స్టెప్ వేయడంతో 'సర్కారు వారి పాట' మూవీలో 'కళావతి' పాటకు అంత క్రేజ్ వచ్చింది.
సాంగ్స్‌లోని హుక్ స్టెప్స్‌తో రీల్స్ ట్రెండ్ అవుతుంటాయి. రామ్ చరణ్ పెద్ద డ్యాన్సర్. ఫస్ట్ మూవీ మొదలు 'నాయక్'లోని 'లైలా ఓ లైలా', 'బ్రూస్ లీ'లోని 'మెగా మెగా మీటర్' వంటి పాటలకు ఎంతో అద్భుతంగా ఫుల్ జోష్‌తో స్టెప్పులేశారు. అలాంటి ఆయనకు కొరియోగ్రాఫర్లు సరైన మూమెంట్స్ ఇవ్వలేకపోయారనే ఇటీవల అన్నాను. ఆ కామెంట్స్‌ను నేను హీరోను టార్గెట్ చేసి అన్నట్లుగా కొందరు అపార్థం చేసుకున్నారు. 'గేమ్ ఛేంజర్' విషయంలో చరణ్ టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేకపోయారనేదే నా బాధ.' అని క్లారిటీ ఇచ్చారు.
Also Read: 'OG' గురించి మరింత తెలుసుకోవాలా? - కామిక్ బుక్ వచ్చేసింది... ఆ క్వశ్చన్స్‌కు ఆన్సర్ తెలియాలంటే...
'OG' మ్యూజిక్‌పై చరణ్ రియాక్షన్
'OG' మ్యూజిక్ గురించి చరణ్ తనతో ప్రత్యేకంగా మాట్లాడారని తమన్ చెప్పారు. 'చరణ్ మంచి వ్యక్తి. అందుకే ఆయన్ను 'మెగా హార్ట్ స్టార్' అని పిలుస్తుంటాను. ఓజీ మ్యూజిక్ ఫైర్ మోడ్ అని చరణ్ అన్నారు. తమన్... చేతులపై కిరోసిన్ పోసుకుని మ్యూజిక్ కంపోజ్ చేశావా? అంటూ నన్ను ప్రశ్నించారు.' అని చెప్పారు తమన్.
చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆదివారానికి 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీలు ఆయనకు విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. 'చిరుత' మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆయన మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి మూవీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తన డ్యాన్స్, నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.





















