Nayanthara in Kannappa : 'కన్నప్ప'లో ప్రభాసే కాదు, నయనతార కూడా - ఆమె క్యారెక్టర్ ఏమిటంటే?
Vishnu Manchu Kannappa Movie Updates : విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటించనున్న సినిమా 'కన్నప్ప'. ఈ సినిమాలో నయనతార కూడా నటించనున్నట్లు తెలిసింది.
యువ కథానాయకుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) టైటిల్ పాత్రలో రూపొందుతున్న సినిమా 'కన్నప్ప' (Kannappa Movie). ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్... అనేది ఉప శీర్షిక. అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ భాషల్లో విడుదల చేసేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విష్ణు తొలిసారి ఆధ్యాత్మిక సినిమా చేస్తున్నారు.
ప్రభాస్ మాత్రమే కాదు... నయన్ కూడా!
'కన్నప్ప'లో మహాశివునిగా అతిథి పాత్రలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కనిపించనున్న విషయం ప్రేక్షకులకు తెలుసు. ఆయన మాత్రమే కాదు... ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కూడా ఓ పాత్ర చేశారు. ఈ విషయాన్ని సీనియర్ హీరోయిన్, నటి మధుబాల కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో తాను సైతం నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. 'కన్నప్ప'లో ప్రభాస్ జోడీగా పార్వతీ దేవి పాత్రలో నయనతార నటించనున్నట్లు సమాచారం.
Actress Madhubala confirms Prabhas and Nayanthara being part of #Kannappa ❤
— N'cafe 💫 (@NayanCafe) September 23, 2023
We're gonna witness this pair after 16 years 🛐#Nayanthara #Prabhas pic.twitter.com/BsID28kYEI
నుపుర్ సనన్ నటించడం లేదు!
'కన్నప్ప'లో నయనతార ఉన్నట్లు మధుబాల తెలిపారు కానీ నయన్ పాత్ర ఏమిటి అనేది ఆవిడ చెప్పలేదు. ఇందులో కథానాయికగా నుపుర్ సనన్ నటించనున్నట్లు తొలుత తెలిపారు. శ్రీకాళహస్తిలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు కూడా! అయితే... డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా నుపుర్ సనన్ సినిమా చేయడం లేదని విష్ణు మంచు ఇటీవల ట్వీట్ చేశారు. తాజాగా ఆయన సెట్ ప్రాపర్టీ మేకింగ్ వీడియో కూడా ఆయన విడుదల చేశారు.
Also Read : శ్రీకాంత్ అడ్డాల గారూ... 'పెదకాపు' కథ ఎక్కడ కాపీ కొట్టారు?
'టైగర్ నాగేశ్వర రావు'తో తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అవుతున్న నుపుర్ సనన్ ఎవరో కాదు... మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', నాగ చైతన్య 'దోచేయ్', ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాల్లో నటించిన కృతి సనన్ చెల్లెలు.
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప'కు దర్శకుడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు.
Also Read : నాని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ఆయన క్రష్ ఎవరో తెలుసా?
హాలీవుడ్ స్థాయిలో 'కన్నప్ప' సినిమాను తెరకెక్కించాలని ఉందని చాలా రోజులుగా విష్ణు మంచు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికి ఆయన కల సాకారం కాబోతోంది. ఈ సినిమాతో ఆయన నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial