Nani: రజినీకాంత్ సినిమాలో నాని, కోలీవుడ్‌లోకి నేచురల్ స్టార్ ఎంట్రీ?
తెలుగులో తనకు ఉన్న మార్కెట్‌ను ఇతర భాషల్లో కూడా క్రియేట్ చేసుకోవాలని నేచురల్ స్టార్ నాని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఎవరైనా ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ చేసినా.. లేక ఇద్దరు కలిసి మల్టీ స్టారర్‌లో నటించినా.. ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరు. ఒకప్పుడు ఈ గెస్ట్ రోల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఒక హీరో చిత్రంలో మరో హీరో గెస్ట్ రోల్ అనేది చాలావరకు తగ్గిపోయింది. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఎప్పటినుండో కొనసాగుతున్నా సౌత్ సినీ పరిశ్రమల్లో మాత్రం గెస్ట్ రోల్ కాన్సెప్ట్ మాత్రం అరుదుగానే కనిపిస్తుంటుంది. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా ఒక స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా మార్కెట్‌పై కన్ను
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరో అయిపోవచ్చు. అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్లవచ్చు అని నిరూపించిన హీరోల్లో నాని ఒకరు. ఎవరికీ తెలియని స్థాయి నుంచి అందరినీ మెప్పించే నేచురల్ స్టార్‌గా మారిన నాని.. పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేశాడు. ఈ స్టార్ నటించే సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. ఇప్పుడు ఇతరేతర భాషల్లో కూడా విడుదల అవుతున్నాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. నటన విషయంలో మాత్రం నాని ఎప్పుడూ ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయలేదు. తెలుగులో తనకు ఉన్న మార్కెట్‌ను ఇతర భాషల్లో కూడా క్రియేట్ చేసుకోవాలని ఈ హీరో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
నేచురల్ స్టార్ నాని నటించిన చివరి చిత్రం ‘దసరా’ కూడా పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ విడుదలయ్యింది. కానీ తెలుగులో కాకుండా ఇంకా ఎక్కడా ఇది విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ ప్రతీ భాషలో హిట్ అవ్వాలని దేశంలోని ముఖ్యమైన సిటీలకు వెళ్లి మరీ ప్రమోషన్స్ చేసింది మూవీ టీమ్. అంతే కాకుండా దసరాతో హిందీ మార్కెట్‌పై కూడా కన్నేశాడు నాని. కానీ ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు. కానీ ‘దసరా’ అనేది నేటివిటీగా తగినట్టుగా ఉంటుంది కాబట్టి తమిళ ఫిల్మ్ మేకర్లకు ఈ చిత్రం చాలా బాగా నచ్చింది. అందుకే కోలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకుంటున్నాడట నాని. తాజాగా తమిళం నుంచి ఒక అదిరిపోయే ఆఫర్ నానిని వెతుక్కుంటూ వచ్చిందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.
జ్ఞానవేల్ దర్శకత్వంలో..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రంలో నాని గెస్ట్ రోల్ ప్లే చేయనున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికీ ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. కానీ ఈసారి నాని కూడా ఈ ఆఫర్‌ను ఒప్పుకున్నాడంటూ వార్తలు రావడం ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారంటూ అంతకంటే ఏం కావాలి అని మ్యూచూవల్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ‘జై భీమ్’ దర్శకుడు టీజీ జ్ఞానవేల్‌తో రజినీకాంత్ ఒక సినిమా చేయనున్నారు. ఆ సినిమాలో నాని కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ కోసం రజినీకాంత్‌కు లుక్ టెస్ట్ కూడా పూరయ్యిందట. పాన్ ఇండియా మార్కెట్ కోసం ట్రై చేస్తున్న నానికి ఈ మూవీ తమిళంలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెడుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Also Read: శివుడి అండతో న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన భక్తుడు - సున్నితమైన అంశాన్ని టచ్ చేసిన 'ఓఎంజీ 2'
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial