అన్వేషించండి

'OMG 2' ట్రైలర్: శివుడి అండతో న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన భక్తుడు - సున్నితమైన అంశాన్ని టచ్ చేసిన 'ఓఎంజీ 2'

'ఓ మై గాడ్' సినిమాకు సీక్వెల్ గా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ OMG 2. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

ఇటీవల కాలంలో రిలీజ్ కు ముందే ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిత్రం 'ఓఎంజీ 2’ (OMG 2). బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీకి సెన్సార్ ఇబ్బందులు తలెత్తాయి. బోర్డు ఏకంగా ఈ చిత్రాన్ని రివ్యూ కమిటీకి పంపడంతో హాట్ టాపిక్ గా మారింది. చివరకు సెన్సార్ బోర్డ్ 27 మార్పులతో 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో కేవలం పెద్దలు మాత్రమే నిర్దేశించేలా అసలు ఈ మూవీలో ఏముంది అనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'ఓఎంజీ 2' ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

2012లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌’ (OMG) చిత్రానికి సీక్వెల్‌గా 'ఓ మై గాడ్ 2' తెరకెక్కింది. అయితే అందులో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్ కుమార్.. ఈ చిత్రంలో శివుడి దూత పాత్రలో నటించారు. ఇక శివ భక్తుడు కాంతి శరణ్ ముద్గల్ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి కనిపించారు. యామీ గౌతమ్‌ ఒక న్యాయవాది పాత్ర పోషించింది. ఫస్ట్ పార్ట్ లో ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు అలరించగా.. ఇప్పుడు రెండో భాగంలో సున్నితమైన సోషల్ ఇష్యూని టచ్ చేసారని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. 

'OMG 2' ట్రైలర్ లోకి వెళ్తే, 'నా భక్తునికి ఒక మహా విపత్తు రాబోతుంది.. నా భక్తునికి సహాయం చేయడానికి ఒక దూతను పంపండి' అని విశ్వాసపాత్రుడైన నందికి శివుడు ఆదేశం ఇస్తారు. వాది మరియు ప్రతివాదిగా కాంతిని పేర్కొంటూ వచ్చే కోర్టు సీన్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కాంతి శరణ్ కొడుకు వివేక్ అనైతిక ప్రవర్తన కారణంగా అతన్ని స్కూల్ నుంచి తొలగిస్తారు. అప్పటి వరకూ తన ఫ్యామిలీతో హ్యాపీగా జీవితం కొనసాగిస్తున్న కాంతి దిగ్భ్రాంతికి గురవుతాడు. దీనికి బాధ్యులైన వారిని కోర్టుకు లాగి తనకు న్యాయం జరిగేలా చూడమని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. 

అప్పుడు ‘గంగా నది ఏ దిశగా ప్రవహిస్తుందో నాకు చెప్పకు.. విశ్వాసం కలిగి ఉండు.. శివుడు నీకు తోడుగా ఉన్నాడు’ అంటూ అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. పంకజ్‌ త్రిపాఠి - యామీ గౌతమ్‌ మధ్య నడిచే కోర్టు డ్రామా ఓవైపు నవ్వు తెప్పిస్తూనే, అందరినీ ఆలోచింపజేస్తుంది. చివర్లో శివుడి గెటప్ లో ఉన్న అక్షయ్ కుమార్ ఆశీర్వాదం ఇస్తే.. 'నాకు ఆశీర్వాదం వద్దు, డబ్బులు కావాలి' అని చెప్పే సన్నివేశం బాగుంది.  

Also Read: క్రేజీ అప్డేట్స్‌తో రాబోతున్న స్టార్ హీరోలు, ఈ నెల ఫ్యాన్స్‌కు పండగే పండగ!

ఇందులో అక్షయ్ కుమార్, పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ‘హర హర మహాదేవ్‌’ అనే బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఓవరాల్ గా ఒక సంఘటన కాంతి జీవితాన్ని ఎలా మార్చేసింది? అది సమాజంలో ఎలాంటి మార్పులకు కారణమైంది? భక్తుడికి శివుడు ఏ విధంగా సహాయం చేసాడు? తన కొడుకును కాపాడుకోవాలనుకున్న కాంతికి న్యాయం దక్కిందా లేదా? అనేది తెలియాలంటే 'ఓ మై గాడ్ 2' సినిమా చూడాల్సిందే. 

'ఓఎంజీ 2' చిత్రానికి మొదటి భాగాన్ని తెరకెక్కించిన అమిత్ రాయ్ నే దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ కు చెందిన కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ మరియు వయాకామ్ 18 స్టూడియో & వకావో ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అమలెందు చౌదరి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సెన్సార్ క్లియరెన్స్ వచ్చి అడ్డంకులు తొలగిపోవడంతో, 2023 ఆగస్టు 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. 'ఓ మై గాడ్' తో హిట్ కొట్టిన అక్షయ్ కుమార్.. దాని సీక్వెల్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి. 

Also Read: Krrish 4: ‘క్రిష్‌-4’ క్రేజీ అప్‌డేట్‌.. ఇండియన్ సూపర్‌ హీరో మళ్ళీ వచ్చేది ఎప్పుడంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Sanjay Dutt: చేతులెత్తి మొక్కిన మున్నాభాయ్... దేశంలో శాంతి లేదా? క్లారిటీ ఇచ్చిన దత్
చేతులెత్తి మొక్కిన మున్నాభాయ్... దేశంలో శాంతి లేదా? క్లారిటీ ఇచ్చిన దత్
Crime Thriller OTT : వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఒకే రోజు ఆరు ఓటీటీల్లో కొత్త మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఒకే రోజు ఆరు ఓటీటీల్లో కొత్త మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Romantic Drama OTT : ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా ఎపిక్ - 'బేబీ' జంట కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా ఎపిక్ - 'బేబీ' జంట కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
TGERC True Up Charges: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
Embed widget