Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!
Nani : 'హాయ్ నాన్న' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రైవేట్ ఫోటో వివాదం తాజా ఇంటర్వ్యూలో స్పందించారు నాని.
Natural Star Nani : రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన 'హాయ్ నాన్న' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, రష్మికల ఫోటో ఎల్ఈడి స్క్రీన్ పై కనిపించడం, దానిపై హోస్ట్ సుమ సీరియస్ అవ్వడం తెలిసిందే. ఈవెంట్ లో భాగంగా సుమ స్క్రీన్ పై కొన్ని ఫోటోలు చూపిస్తూ వాటిపై స్పందించాల్సిందిగా హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ని కోరింది. దాంతో నాని, నజ్రియా, దుల్కర్ సల్మాన్ ఫోటోలను చూపించారు. వాటికి తనకు తోచిన విధంగా మృణాల కామెంట్ చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా స్క్రీన్ పై రష్మిక, విజయ్ దేవరకొండ ప్రైవేట్ పిక్ స్క్రీన్ పై కనిపించింది. దీంతో అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుమ కూడా ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూజ్ అయింది.
ఈ సంఘటనపై నానిపై కూడా కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. తన సినిమా ప్రచారం కోసం ఇతర హీరోయిన్ల ప్రైవసీకి భంగం కలిగించేలా వారి ఫోటోలను వాడుకుంటారా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు. అంతేకాకుండా రౌడీ హీరో ఫ్యాన్స్ నాని సినిమా ఈవెంట్లో అలా జరగడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఇదే విషయంపై నాని రియాక్ట్ అవుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'దసరా' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. తండ్రి, కూతుళ్ళ మధ్య అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించారు. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.
ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఈ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. డిసెంబర్ 7న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. రిలీజ్ దగ్గర పడటంతో నాని ముందుండి మరి ఈ సినిమా ప్రమోషన్స్ ని నడిపిస్తున్నారు. ఈ మేరకు వరస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్, రష్మిక ఫోటో వివాదం పై స్పందించాడు. నాని మాట్లాడుతూ..
"అసలు అది మాకు తెలియకుండా జరిగింది. ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు చాలామంది పనిచేస్తుంటారు. ఎవరు ఎందుకు చేశారనేది క్లారిటీ లేదు. బహుశా ఎక్సైట్మెంట్ లో ఆ పిక్ వేసి ఉండొచ్చు. విజయ్, రష్మిక ఇద్దరూ నాకు ఫ్రెండ్స్. వాళ్ల ఫోటోలు బహిరంగం చేయాలని మేము ఎందుకు అనుకుంటాం? ఆ సంఘటన వల్ల బాధపడిన వాళ్లకి క్షమాపణ చెబుతున్నా. ఆ పిక్ పెట్టిన వ్యక్తిని ఇప్పుడు నిందించి లాభం లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఉద్యోగం పోతుందేమో అనే టెన్షన్ లో ఉంటాడు" అని నాని తెలిపాడు. అంతేకాకుండా మాస్ కథలను పక్కనపెట్టి ఇలాంటి ఎమోషనల్ డ్రామాలు ఎందుకు చేస్తున్నారని అడిగితే 'మాస్ కథలు మాత్రమే కాదు అన్ని రకాల కథలు చేయడం నటుడిగా తన బాధ్యత' అని అన్నారు నాని.
Also Read : యూట్యూబ్‌లో దుమ్ములేపిన 'సలార్' ట్రైలర్ - 'KGF2' తో పాటూ అన్ని రికార్డులు బద్దలు!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply