Nagarjuna: టబు పెళ్లి చేసుకోలేనని చెప్పింది - మా ఇంట్లోనే ఉంటుంది: నాగార్జున కామెంట్స్ వైరల్
Nagarjuna - Tabu: నాగార్జున, టబు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులంతా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. దానిపై ఒక పాత ఇంటర్వ్యూలో నాగ్ క్లారిటీ ఇచ్చారు.
Nagarjuna About Relationship With Tabu: ఇప్పుడు మాత్రమే కాదు.. ఎప్పటినుండో ఒక హీరో, హీరోయిన్ క్లోజ్‌గా ఉంటే వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం మొదలవుతుంది. టాలీవుడ్‌లోని సీనియర్ హీరోల గురించి ఎక్కువగా అలాంటి రూమర్స్ ఏమీ వినపడలేదు. కానీ నాగార్జున మాత్రమే ఇలాంటి రూమర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ టబుతో నాగ్ కెమిస్ట్రీ బాగుండడంతో ఆఫ్ స్క్రీన్ కూడా వీరిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటిపై నాగార్జున ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. టబు గురించి తను మాట్లాడిన పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది.
ఫ్యామిలీతో క్లోజ్..
టబుతో రిలేషన్‌షిప్ చాలా దూరం వెళ్లిందని ప్రచారం అయ్యింది అని నాగార్జునకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘అలా ప్రచారం అయ్యింది ఎందుకంటే.. టబు వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. అమల దగ్గరుండి టబుకు ఇల్లు కట్టించింది. వాళ్లిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చాలామందికి తెలియనిది ఏంటంటే టబు హైదరాబాద్ అమ్మాయి. అలా పరిచయం అయ్యింది. అప్పటినుండి మాకు తెలిసిన అమ్మాయే. నా ఫేవరెట్ హీరోయిన్, ఇష్టమైన కో వర్కర్ ఎవరంటే టబు అనే చెప్తాను. ఇప్పటికీ హైదరాబాద్ వస్తే ఇంకెక్కడికీ వెళ్లదు. మా ఇంట్లోనే ఉంటుంది. నాన్నకు కూడా తనంటే అంతే ఇష్టం’’ అని టబు చాలా కుటుంబానికి కూడా చాలా క్లోజ్ అని చెప్పుకొచ్చారు నాగార్జున.
బాయ్‌ఫ్రెండ్‌తో సమస్య..
టబుకు ఇప్పటికీ పెళ్లి కాలేదు. అలా అవ్వకపోవడానికి కూడా తనే కారణమని అని నాగార్జునను అడగగా.. ఆ ప్రశ్న విని నవ్వుకున్నారు. ‘‘పెళ్లి చేసుకోలేను అని చెప్పింది. తను చాలా ఎమోషనల్ అమ్మాయి. నేను తన డాక్టర్‌లాగా. ఎప్పుడో తెల్లవారుజామున ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది. ఎవరా అని భయపడుతూ లిఫ్ట్ చేస్తాను. అవతల వైపు నుండి ఏడుస్తూ ఉంటుంది. ముందు ఏ బాయ్‌ఫ్రెండ్‌తో ఏ సమస్య వచ్చింది అని అడుగుతాను. అవును అని ప్రాబ్లెమ్ అంతా చెప్తుంది. ఒక గంటసేపు నాకు నిద్ర ఉండదు. నాకు తెలిసింది ఏదో చెప్తాను. మా ఫ్రెండ్‌షిప్ అనేది మాటల్లో చెప్పలేనిది’’ అని టబుతో తనకు ఉన్న రిలేషన్‌షిప్ గురించి వివరంగా చెప్పారు.
అనుష్కతో కూడా..
టబు కెరీర్ టాలీవుడ్‌లో బ్రేక్ పడిన తర్వాత అనుష్కతో నాగార్జునకు రిలేషన్‌షిప్ ఉందని రూమర్స్ వచ్చాయి. నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ సినిమాతోనే అనుష్క హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాని వల్లే రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి కూడా నటించారు కూడా. కానీ ఈ రూమర్స్‌పై నాగార్జున గానీ, అనుష్క గానీ ఎప్పుడూ పెద్దగా స్పందించడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం నాగార్జున, టబు, అనుష్క ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. టబు అయితే పూర్తిగా బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. చాలా ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ అదే కంటిన్యూ చేయలేకపోయింది. ప్రస్తుతం తను బాలీవుడ్‌లోనే బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయింది.
Also Read: డియర్ బాలీవుడ్, సౌత్ ఇండియన్స్ అంటే అంత చీపా? ఎన్నాళ్లు ఈ వెక్కిరింపులు, అవమానాలు?