అన్వేషించండి

Bholaa Shankar New Song : తమన్నా ముద్దు పేరుతో చిరంజీవి పాట పాడితే

Milky Beauty Song Promo : 'భోళా శంకర్'లో కొత్త పాటను శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే... తమన్నా ముద్దు పేరు మీద రాయడం! 

ఉత్తరాది అందాల భామ తమన్నా భాటియా (Tamannaah Bhatia)కు మన తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ముద్దు పేరు 'మిల్కీ బ్యూటీ' (Milky Beauty). ఆమె పాలరాతి శిల్పంలా ఉంటుందని అలా అంటుంటారు. అప్పుడు ఆ ముద్దు పేరు మీద ఓ పాట రాశారు. దానికి తమన్నాతో పాటు చిరంజీవి స్టెప్పులు వేశారు. ఆ పాట ఎలా ఉంటుందో రేపు అందరికీ తెలుస్తుంది. 

'భోళా శంకర్'లో మిల్కీ బ్యూటీ సాంగ్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆల్రెడీ సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు. మూడో పాట రేపు రిలీజ్ కానుంది. 

మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన బాణీకి... 'నా మిల్కీ బ్యూటీ, నువ్వే నా స్వీటీ' అంటూ సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. విజయ్ ప్రకాష్, మహతి స్వర సాగర్, సంజన ఆలపించారు. శుక్రవారం (జూలై 21)న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈ రోజు ప్రోమో రిలీజ్ చేశారు. అది చూస్తే... ఫారిన్ లో అందమైన లొకేషన్లలో పాటను తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది.

Also Read  హ్యాట్రిక్ ప్లాపుల్లో ఉన్న హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!  

చిరుతో పాటు కీర్తీ, తమన్నా, సుశాంత్ డ్యాన్స్! 
Jam Jam Jajjanaka Song : కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన 'జామ్ జామ్ జజ్జనక' లిరికల్ వీడియో చూస్తే... చిరుతో పాటు ఈ పాటలో కీర్తీ సురేష్, సుశాంత్, తమన్నాతో స్టెప్పులు వేశారు. సంతోషం, సంబరం నిండిన సమయాల్లో అందరూ పాడుకునే పాటలా రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది.   

Also Read 'హిడింబ' సినిమా రివ్యూ : మనుషులను తినే గిరిజన జాతి మహానగరానికి వస్తే?

ఆగస్టు 11న 'భోళా శంకర్' విడుదల!
'భోళా శంకర్' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం ముగిసింది. చిరంజీవి తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ సైతం పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించారు. కీర్తీ సురేష్ ప్రేమికుడిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం.

రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, 'హైపర్' ఆది, 'వైవా' హర్ష, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ : రామ్ - లక్ష్మణ్ & దిలీప్ సుబ్బరాయన్ & కాచే కంపాక్డీ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత :  కిషోర్ గరికిపాటి, ఛాయాగ్రహణం : డడ్లీ.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Embed widget