Mehreen Pirzada Wedding: హానీ పాపకు పెళ్లైంది... సడన్‌గా మెహరీన్ వెడ్డింగ్... షాక్ ఇచ్చిన పంజాబీ బ్యూటీ
Mehreen Pirzada Husband Name And Photo: హీరోయిన్ మెహరీన్ వివాహ బంధంలో అడుగు పెట్టారు. ప్రేక్షకులకు తన భర్తను పరిచయం చేశారు. ఇంతకీ, ఆయన పేరు, ఫోటోలు చూడండి.

హీరోయిన్ మెహరీన్ కౌర్ పిర్జాదా (Mehreen Pirzada) ఓ ఇంటి కోడలు అయ్యారు. వివాహ బంధంలో ఆమె అడుగు పెట్టారు. ఆడియన్స్ అందరికీ ఆదివారం రాత్రి ఆమె సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓ విధంగా కొందరికి షాక్ అని కూడా చెప్పాలి. వై? ఎందుకు? అంటే... ఉన్నట్టుండి పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. ఇంతకీ, మెహరీన్ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఆయన పేరు ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
మెహరీన్ భర్త పేరు, వివరాలు తెలుసా?
Mehreen Pirzada Husband Name: ఏప్రిల్ 26, 2026... ఆదివారం తన వివాహం జరిగినట్లు మెహరీన్ సోషల్ మీడియాలో తెలిపారు. పెళ్లి ఫోటోలు సైతం షేర్ చేశారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం ఆమె వివాహం చేసుకున్నట్లు ఫోటోలు చూస్తే తెలుస్తోంది. మెహరీన్ భర్త పేరు అర్ష్ ఔలాఖ్. ఆయనొక వ్యాపారవేత్త అని సమాచారం అందుతోంది.
అర్ష్ ఔలాఖ్, మెహరీన్ పిర్జాదాలది పెద్దలు కుదిర్చిన వివాహం అని, కొన్ని రోజులుగా వధూవరులు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారని, ఇరువురి అంగీకారంతో పెళ్లి జరిగిందని తెలుస్తోంది.
See Photos: Mehreen Pirzada Wedding Pics - సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్ మెహరీన్... భర్తతో ఫస్ట్ ఫోటోలు
View this post on Instagram
మెహరీన్ ఖాతాలో టాలీవుడ్ హిట్స్!
Mehreen Pirzada Telugu hit movies list: 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ'తో తెలుగు తెరకు మెహరీన్ కథానాయికగా పరిచయం అయ్యారు. నటిగా ఆమె తొలి సినిమా కూడా అదే. తెలుగుతో పాటు మాతృభాష పంజాబీ, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించారు.
తెలుగులో చార్మింగ్ స్టార్ శర్వానంద్ 'మహానుభావుడు', మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', మాస్ మహారాజా రవితేజకు జంటగా నటించిన 'రాజా ది గ్రేట్' సినిమాలు విజయాలు అందించాయి. ముఖ్యంగా 'హానీ ఈజ్ ద బెస్ట్' అంటూ 'ఎఫ్ 2'లో ఆమె చెప్పిన సిగ్నేచర్ డైలాగ్ వైరల్ అయ్యింది. 'స్పార్క్ లైఫ్' తర్వాత తెలుగులో మెహరీన్ మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం ఆవిడ చేతిలో ఓ కన్నడ సినిమా ఉంది.
Also Read: Dhanush: వెంకీని ఆటాడుకున్న ధనుష్... టైటిల్ తెచ్చిన తంటా... 'కర' ప్రీ రిలీజ్‌లో ధనుష్ ఏమన్నారంటే?
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















