అన్వేషించండి

మెగా బ్లాక్ బస్టర్ 'శంకర్ దాదా MBBS' రీ రిలీజ్ - ఫ్యాన్స్ రెడీనా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబిబిఎస్' చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 4న ఈ చిత్రం రీరిలీజ్ కానున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.

టాలీవుడ్​లో కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్స్ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. మెగాస్టార్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు రిలీజ్​కు రెడీ అయింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చిత్రాలు రీ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రెండ్ లో మెగాస్టార్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇంతకీ రీ రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి? డీటెయిల్స్​లోకి వెళ్తే.. ఈమధ్య థియేటర్స్​లో స్ట్రైట్ సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మన టాలీవుడ్​లో రీరిలీజ్ ట్రెండ్ పీక్స్​కి చేరింది. ఇప్పుడు ఇదే ట్రెండ్​ని ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా స్టార్ట్ చేయబోతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ నుంచి రీరిలీజ్ అయిన చాలా సినిమాలు మంచి కలెక్షన్స్​ని అందుకున్నాయి. వాటిలో కొన్ని మూవీస్ అయితే ఒరిజినల్ రిలీజ్ టైం లో వచ్చిన కలెక్షన్స్ కంటే ఇప్పుడు రాబట్టిన కలెక్షన్స్ ఎక్కువగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబిబిఎస్' చిత్రాన్ని మళ్లీ రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. జయంత్ సి పరాంజీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2004 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం ఏకంగా వంద రోజులు ఆడింది. ఇందులో మెగాస్టార్ సరసన సోనాలి బింద్రే కథానాయికగా నటించగా శ్రీకాంత్, పరేశ్ రావల్ ముఖ్య పాత్రలు పోషించారు.

హిందీలో వచ్చిన 'మున్నాభాయ్ ఎంబిబిఎస్' చిత్రానికి ఈ మూవీ రీమేక్​గా తెరకెక్కగా సెన్సేషనల్ ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరాని ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీతో పాటు తెలుగులోనూ భారీ సక్సెస్ అందుకున్న 'శంకర్ దాదా ఎంబిబిఎస్' మూవీని దాదాపు 19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేయడం విశేషం. నవంబర్ 4వ తేదీన ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జెమిని ఫిలిం సర్క్యూట్ సంస్థ ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ న్యూస్​తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. రీసెంట్​గా 'బోలాశంకర్' తో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం 'బింబిసారా' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. UV క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, అనుష్క కథానాయికలుగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి 'ముల్లోకాల వీరుడు' అనే టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : బాలీవుడ్​లో మోస్ట్ కాంట్రవర్షియల్ బ్రేకప్స్ వీళ్లవే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2: 'ధురంధర్ 2' ట్రైలర్ రికార్డ్... రెండు రోజుల్లో హిస్టరీ!
'ధురంధర్ 2' ట్రైలర్ రికార్డ్... రెండు రోజుల్లో హిస్టరీ!
Ritu Varma: రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
Alpha Release Date: ఆలియా భట్ యాక్షన్ ఫిల్మ్... 'ఆల్ఫా' రిలీజ్ డేట్ ఫిక్స్!
ఆలియా భట్ యాక్షన్ ఫిల్మ్... 'ఆల్ఫా' రిలీజ్ డేట్ ఫిక్స్!
Venkatesh: సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Sai Pallavi: సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Ritu Varma: రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
అసలైన , నకిలీ QR కోడ్‌లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి, లేకపోతే స్కాన్ చేయగానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది!
అసలైన , నకిలీ QR కోడ్‌లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి, లేకపోతే స్కాన్ చేయగానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది!
Embed widget