రీతూ వర్మతో రిలేషన్ షిప్పై క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ - అందుకే పార్టీకి వచ్చింది!
Vaishnav Tej : 'ఆదికేశవ' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ రీతు వర్మతో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చాడు.
Vaishnav Tej : మెగా ఫ్యామిలీలో ఈ మధ్య ఓ ప్రేమ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఎవరికి తెలియకుండా చాలా ఏళ్లపాటు సీక్రెట్ రిలేషన్షిప్ మైంటైన్ చేసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా మరో మెగా హీరో ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ మెగా హీరో ఎవరు? ఏ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు? వివరాల్లోకి వెళ్తే.. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడట. వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీకి హీరోయిన్ రీతూ వర్మ హాజరవడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ పార్టీలో వైష్ణజ్ తేజ్ తో రీతు వర్మ క్లోజ్ గా కనిపించడంతో వీరిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వైష్ణవ తేజ్, రీతు వర్మ మధ్య సీక్రెట్ రిలేషన్ నడుస్తుందనే చర్చ నెట్టింట మొదలైంది. అంతేకాదు వైష్ణవ్ తో రీతు వర్మ ప్రేమలో ఉందని, త్వరలోనే ఆమె కూడా మెగా ఫ్యామిలీలోకి కోడలుగా ఎంట్రీ ఇవ్వబోతుందని చాలామంది నెటిజన్స్ కామెంట్లు చేయడంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యింది. దీంతో తాజాగా దీనిపై వైష్ణవ్ తేజ్ స్వయంగా స్పందించాడు. 'ఆదికేశవ'(Adikeshava) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ తేజ్ రీతు వర్మతో రిలేషన్షిప్ పై స్పందిస్తూ..
" తాను ఎవరిని ప్రేమించడం లేదు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అంతే కాదు లావణ్య త్రిపాఠికి రీతు వర్మ మంచి ఫ్రెండ్ కాబట్టి ఆమె పార్టీకి వచ్చింది. ఆ కారణంతోనే పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. అంతకుమించి మరేమీ లేదు" అంటూ ఈ సందర్భంగా వైష్ణవ్ స్పష్టం చేశారు. కాగా గతంలోనూ వైష్ణవ్ తేజ్ కి సంబంధించిన ప్రేమ వార్తలు వైరల్ అయ్యాయి. 'ఉప్పెన'(Uppena) రిలీజ్ తర్వాత కృతి శెట్టితో వైష్ణవ్ తేజ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని వార్తలు రాగా వాటిలోనూ ఎలాంటి నిజం లేదని గతంలో క్లారిటీ ఇచ్చాడు వైష్ణవ తేజ్.
ఇక 'ఆదికేశవ' సినిమా విషయానికొస్తే.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల హీరొయిన్ గా నటిస్తోంది. మలయాళ యాక్టర్స్ భోజు జార్జ్, అపర్ణ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది
Also Read : పెళ్ళి తర్వాత తొలిసారి భర్త గురించి లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - అమేజింగ్, కేరింగ్ అంటూ!