అన్వేషించండి

Lavanya Tripathi About Varun Tej : పెళ్ళి తర్వాత తొలిసారి భర్త గురించి లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - అమేజింగ్, కేరింగ్ అంటూ!

 Lavanya Tripathi : పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్​తేజ్​పై ఆసక్తికర కామెంట్స్ చేసింది లావణ్య త్రిపాఠి. ఈ మేరకు లావణ్య సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

VarunLav : వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత భర్త గురించి మొదటిసారి ఆసక్తికర కామెంట్స్ చేసింది లావణ్య త్రిపాఠి. దీంతో లావణ్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలే పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో ఈ జంట గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. 'మిస్టర్'(Mister) మూవీ షూటింగ్ కోసం తొలిసారి వరుణ్, లావణ్య ఇటలీలో కలుసుకున్నారు. ఆ తొలి పరిచయం ప్రేమగా మారి కొన్ని సంవత్సరాలు సీక్రెట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు. ఇక ఎట్టకేలకు తమ రిలేషన్షిప్ బయటపెట్టి ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి తొలిసారి ఏ చోట కలుసుకున్నారో అదే చోట గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.

వరుణ్, లావణ్య పెళ్లి తోపాటు రిసెప్షన్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలో జరిగిన పెళ్లికి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అటెండ్ అవ్వగా హైదరాబాద్ లో రిసెప్షన్ కి సినీ తారలంతా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వరుణ్, లావణ్య తమ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తొలిసారి వరుణ్ తేజ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. లావణ్య తన సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..

" నా భర్త జాలి, కేరింగ్ కలిగిన ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ నాలోనే దాచుకుంటాను. మా మూడు రోజుల పెళ్లి ఎంతో అద్భుతంగా ఒక డ్రీమ్ లాగా జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించి, బెస్ట్ విషెస్ అందించిన వారందరికీ నా కృతజ్ఞతలు" అంటూ తన పోస్టులో పేర్కొంది. ఈ సందర్భంగా లావణ్య షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. లావణ్య షేర్ చేసిన పిక్స్ లో ఆమె పెళ్లి చీరకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ చీరపై వరుణ్ లవ్ అని రాసి ఉంది. దాంతోపాటు కాళ్లకు పారాణి, పట్టీలు వేసుకున్న ఫోటో కూడా షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

కాగా లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి హైకోర్టులో న్యాయవాది. తల్లి టీచర్. లావణ్య తన స్కూలింగ్ ని డెహ్రాడూన్ లో పూర్తి చేసింది. ఆమెకి ఓ చెల్లి తో పాటు తమ్ముడు కూడా ఉన్నాడు. 'అందాల రాక్షసి' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు వెండితెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక వరుణ్ తేజ్ తో కలిసి 'అంతరిక్షం' 'మిస్టర్' వంటి సినిమాలు చేసింది. మరి పెళ్లి తర్వాత లావణ్య సినిమాలు చేస్తుందా? లేదా అనేది చూడాలి.

Also Read : 'సుడిగాలి' సుధీర్ రిస్క్ చేస్తున్నాడా? లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)

టాప్ హెడ్ లైన్స్

Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget