Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ రిస్క్ చేస్తున్నాడా? లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా?
Calling Sahasra Release Date: సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'కాలింగ్ సహస్ర'. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే... అతను భారీ రిస్క్ చేస్తున్నాడేమోనని కొందరి ఫీలింగ్.
Animal Movie Vs Sudigali Sudheer's Calling Sahasra : బుల్లితెరపై తన స్కిట్స్, డ్యాన్స్, యాంకరింగ్, నటనతో పేరు తెచ్చుకున్న నటుడు 'సుడిగాలి' సుధీర్. ఈ స్టార్ కమెడియన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ', 'పోవే పోరా', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' రియాలిటీ షోలతో ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ఆయన టీవీ యాక్టర్ కాదు... సిల్వర్ స్క్రీన్ హీరో! ఆయన సోలో హీరోగా నటించిన 'గాలోడు' కమర్షియల్ సక్సెస్ సాధించింది. త్వరలో కొత్త సినిమాతో వస్తున్నారు.
'యానిమల్' వర్సెస్ 'కాలింగ్ సహస్ర'!
'సుడిగాలి' సుధీర్ హీరోగా రూపొందిన తాజా సినిమా 'కాలింగ్ సహస్త్ర'. ఇందులో డాలీ షా హీరోయిన్. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ సంస్థలపై విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి సంయుక్తంగా నిర్మించారు. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమిటంటే...
డిసెంబర్ 1న 'యానిమల్' విడుదల అవుతోంది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఆ సినిమా మీద తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్నాయి. 'అర్జున్ రెడ్డి' తీసిన సందీప్ రెడ్డి ఆ చిత్రానికి దర్శకుడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సినిమా విడుదల రోజున 'సుడిగాలి' సుధీర్ సినిమా విడుదల చేయడం అంటే రిస్క్ అని కొందరి ఫీలింగ్.
Also Read : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమను బయటపెట్టిన బాలకృష్ణ!
Get Ready for the pulse-pounding excitement 👀
— Beyond Media (@beyondmediapres) November 18, 2023
The much-anticipated crime thriller #CallingSahasra hits the screens on Dec 1st💥#CallingSahasraMovie @sudheeranand @dollysha_c @ActorSivabalaji #ArunVikkirala @MohithRahmaniac #SuddalaAshokTeja #YazinNizar @vijesh_nirvana… pic.twitter.com/gcX5Zk5tHT
'కాలింగ్ సహస్త్ర'తో హీరో 'సుడిగాలి' సుధీర్ అండ్ టీమ్ రిస్క్ చేస్తున్నారా? లేదంటే తమ సినిమా మీద ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది మరో రెండు వారాలు ఆగితే క్లారిటీ వస్తుంది. ఒక్కోసారి పెద్ద సినిమాలతో విడుదలయ్యే చిన్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తూ ఉంటాయి. ఆ కోవలో సుధీర్ సినిమా చేరుతుందేమో చూడాలి.
''ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. సుధీర్ గారు, హీరోయిన్ డాలీ షా మద్దతుతో సకాలంలో సినిమా పూర్తి చేశాం. ఈ సినిమాలో సరికొత్త సుధీర్ కనిపిస్తారు. 'సుధీర్ ఇటువంటి క్యారెక్టర్లలో నటిస్తారా?' అని ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుందీ సినిమా. ఊహలకు అందని విధంగా మలుపులు ఉంటాయి. ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్'' అని దర్శక నిర్మాతలు అన్నారు.
Also Read : మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?
సుధీర్ ఆనంద్ బయానా (Sudigali Sudheer), డాలీషా జంటగా నటించిన 'కాలింగ్ సహస్త్ర' సినిమాలో శివ బాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : సన్ని .డి, కూర్పు : గ్యారీ బి.హెచ్, పాటలు : మోహిత్ రేహమేనియాక్, సంగీతం : మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థ : షాడో మీడియా ప్రొడక్షన్స్ - రాధా ఆర్ట్స్, రచన & దర్శకత్వం : అరుణ్ విక్కీరాల, నిర్మాతలు : వెంకటేశ్వర్లు కాటూరి - విజేష్ తయాల్ - చిరంజీవి పమిడి.