Unstoppable with NBK : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమను బయటపెట్టిన బాలకృష్ణ!
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని టాలీవుడ్ లోకమంతా కోడై కూస్తుంది. అయితే... వాళ్ళు ఎప్పుడు ఆ ప్రేమ నిజమని చెప్పలేదు. కానీ, ఇప్పుడు వాళ్ళ ప్రేమ బాలకృష్ణ ద్వారా బయటకు వచ్చేసినట్లే కనబడుతోంది.
![Unstoppable with NBK : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమను బయటపెట్టిన బాలకృష్ణ! Balakrishna Loves Rashmika Phone call with Vijay Devarakonda Funny moments in Unstoppable with NBK Unstoppable with NBK : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమను బయటపెట్టిన బాలకృష్ణ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/18/2d279ae5be9f7b74ce858f1887b71c491700300348274313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రష్మికా మందన్నా (Rashmika Mandanna)ను నేషనల్ క్రష్ అంటారు. ఆమెను చూసి ఎంతో మంది ప్రేమలో పడ్డారు. మరి, ఆవిడ ఎవరి ప్రేమలో పడ్డారు? ఈ ప్రశ్నకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంత మంది, ప్రేక్షకుల్లో ఎక్కువ మంది చెప్పే పేరు రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ! అయితే... తాము ప్రేమలో ఉన్నామని వాళ్ళిద్దరూ ఎప్పుడూ అంగీకరించినది లేదు. తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని చెబుతూ వస్తున్నారు. 'యానిమల్' ప్రమోషనల్ కార్యక్రమాల కోసం రష్మిక మరోసారి 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె' షోకి వచ్చారు.
రష్మికను కార్నర్ చేసిన బాలకృష్ణ!
'యానిమల్'లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి'తోనే ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత ఆ కథను హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 'యానిమల్' చేశారు.
'అన్‌స్టాపబుల్' షోలో స్క్రీన్ మీద 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' పోస్టర్లు వచ్చాయి. అవి చూసిన తర్వాత 'ఇద్దరిలో బెటర్ హీరో ఎవరు? అని అడగండి' అని బాలకృష్ణకు చెప్పారు. 'రష్మిక... ఇద్దరిలో ఎవరు బావున్నారు?' అని ఆయన అడిగారు. అప్పుడు నేషనల్ క్రష్ ఏమీ చెప్పకుండా నవ్వుతూ కనిపించారు. ప్రోమోలో అంత వరకే ఉంది. మరి, ఆమె చెప్పిన సమాధానం ఏమిటో తెలియాలంటే ఈ నెల 24న స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్ చూడాలి.
విజయ్ దేవరకొండకు చెప్పు...
నేను రష్మికను ప్రేమిస్తున్నా! - బాలకృష్ణ
విజయ్ దేవరకొండ ఫోన్ కాల్ ద్వారా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె' షోలో పార్టిసిపేట్ చేశారు. అయితే... రౌడీ బాయ్ ఫోన్ చేసిన సంగతి రష్మికకు తెలియదేమో! ఫోనులో 'వాట్సాప్ రే' అంటూ విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించిన తర్వాత ముసిముసి నవ్వుల్లో ఆమె మునిగిపోయారు. తర్వాత సందీప్ రెడ్డి వంగా ఫోన్ తీసుకుని విజయ్ దేవరకొండతో మాట్లాడుతున్న సమయంలో... అతడి దగ్గరకు వెళ్లిన బాలకృష్ణ ''మీ హీరోకి చెప్పు... నేను రష్మికను ప్రేమిస్తున్నా'' అని అన్నారు.
Also Read : మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?
🦁#UnstoppableWithNBK Wildest episode is gonna be 🅺ickass 🅲RUSHing( read KRUSH❤) 🅟owerful 🅳ominating 🗓Mark your calendars for the Wildest Entertainment Feast… Nov 24 it is#Animal📷#NandamuriBalakrishna #RanbirKapoor @iamRashmika @imvangasandeep @AnimalTheFilm… pic.twitter.com/kGjXCqEO4t
— ahavideoin (@ahavideoIN) November 18, 2023
విజయ్ దేవరకొండ ఫోన్ చేసినప్పుడు... ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు... 'డియర్ కామ్రేడ్' సినిమాలోని 'హృదయం పొంగేలే' పాటను ప్లే చేశారు. దీపావళి పండక్కి విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక ఉన్నారని, కలిసే సెలబ్రేట్ చేసుకున్నారని సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రేమను షోలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ బయట పెట్టారని జనాలు కామెంట్ చేస్తున్నారు.
Also Read : 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమా రివ్యూ: రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టారా? డిజప్పాయింట్ చేశారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)