Malvi Malhotra: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు - హీరోయిన్ సంచలన ఆరోపణలు
Malvi Malhotra: బాలీవుడ్ స్టార్ డైెరెక్టర్ విక్రమ్ భట్ పై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాల్వీ మాట్లాడుతూ విక్రమ్ భట్ తనని మోసం చేశాడని పేర్కొంది.
![Malvi Malhotra: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు - హీరోయిన్ సంచలన ఆరోపణలు Malvi Malhotra Shocking Comments on Director Vikram Bhatt Malvi Malhotra: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు - హీరోయిన్ సంచలన ఆరోపణలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/7b3f0ba972def4e43959e8336719e16b1707223926148929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Malvi Malhotra Sensational Comments: సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు. లక్ కూడా ఉండాలి. అంతకంటే స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. అలా అయితేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు. హీరోయిన్లలో చాలామంది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండ వచ్చినవారే ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మొదలు పెట్టి హీరోయిన్ వరకు ఎదిగినవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు ఊరికే ఆ స్థాయికి చేరుకోలేదని, ఎన్నో ఇబ్బందులు.. అవమానాలు పడి ఇక్కడికి చేరుకున్నామని చెబుతుంటారు.
ఈ జర్నీలో ఎన్నో మోసాలు, వెన్నుపోట్లు చూశామని ఇప్పటికే చాలామంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటకు చెప్పుకున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా స్టార్ నిర్మాత చేతిలో మోసపోయానంటూ నోరువిప్పింది. ఆమే మాల్వీ మల్హోత్రా. 'మిలన్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆమె, మొదటి బుల్లితెర నటిగా రాణించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ సరసన నటిస్తుంది. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన మాల్వీ బాలీవుడ్ స్టార్ దర్శక-నిర్మాత విక్రమ్ భట్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
ఆయన తనని మోసం చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా బుల్లితెరపై నటిస్తూనే మాల్వీ పలు ప్రైవేటు అల్బంలో చేసేది. ఈ క్రమంలో విక్రమ్ భట్ కూమార్తె కృష్ణభట్ దర్శకత్వంలో తెరకెక్కిన బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ అనే మ్యూజిక్ అల్బంలో నటించానంది. దీనికి విక్రమ్ భట్ నిర్మాత అని, ఈ అల్బమ్‌లో నటించినందుకు ఆయన తనకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని చెప్పింది. డబ్బుల కోసం ఫోన్, మెసేజ్‌లు చేసినా కనీసం రెస్పాండ్ అవ్వలేదని తాజాగా మాల్వీ వాపోయింది.
Also Read: విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య - ఒక్క పోస్ట్‌తో తేల్చేసింది..
నాలా ఎవరూ మోసపోకూడదు..
ఈ సందర్భంగా మాల్వీ మాట్లాడుతూ.. "ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ భట్ పని చేయించుకుని రెమ్యునరేషన్ ఇవ్వకుండ మోసం చేశారు. ఆయన విక్రమ్ భట్ నిర్మించిన బర్బాద్ కర్ దియా అనే అల్బమ్ సాంగ్‌లో పనిచేయమని అడిగారు. అదే టైంలో నేను దక్షిణాది సినిమాలతో బిజీగా ఉన్నాను. స్వయంగా విక్రమ్ భట్ అడగడంతో కాదలేకపోయా. నా బిజీ షెడ్యూల్లోనూ వారి కోసం పనిచేశా. అయితే దానికి నాకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. నేను సౌత్‌లో బిజీగా ఉండటం వల్ల వెంటనే అడగలేకపోయా. ఓసారి పెండింగ్ డబ్బుల కోసం ఫోన్ చేస్తే కనీసం విక్రమ్ భట్ రెస్పాండ్ అవ్వలేదు. చాలాసార్లు కాల్స్, మెసేజ్‌లు చేశాను.
కానీ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులుకు మరో సాంగ్‌లో నటించమని ఆయన అడిగారు. అప్పుడు చేయనని చెప్పేశాను. నా లా ఎవరూ ఆయన చేతిలో మోసపోకుడదనే నేను ఇప్పుడు ఈ విషయం బయటపెట్టాను" అంటూ చెప్పుకొచ్చింది. కాగా మాల్వీ ప్రస్తుతం రాజ్ తరుణ్ తిరగబడరా సామి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే మాల్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అంతకు ముందు ఆమె హిందీతో పాటు తమిళ్, మలయాళంలోనూ పలు చిత్రాలు చేసింది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)