Aishwarya Rai: విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య - ఒక్క పోస్ట్‌తో తేల్చేసింది..
Aishwarya Rai Bachchan: ఎట్టకేలకు ఐశ్వర్య విడాకుల వార్తలపై స్పందిస్తూ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసి డైవోర్స్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుంది.
Aishwarya Rai Post Viral: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్- హీరో అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీరిమధ్య మనస్పర్థలు తలెత్తాయంటూ ఏదోక వీడియోను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. అభిషేక్‌తోనే ఆమె అత్త జయ బచ్చన్‌తో కూడా ఐశ్వర్యకు తరచూ విభేదాలు ఉన్నాయంటూ ఇన్‌సైడ్ సర్కిల్లో టాక్ నడిచేది. వీటిపై అభిషేక్ కానీ, ఐశ్వర్య కానీ ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. దాంతో అదే నిజమని కొందరు గాసిప్ రాయుళ్లు తెల్చేస్తూ వార్తలు సృష్టిస్తున్నారు.
దానికి ప్రత్నాయంగా ఈ జంట కూడా సన్నిహితంగా ఉండే ఫొటోలు, వీడియో షేర్ చేస్తూ విడాకుల వార్తలపై పరోక్షంగా స్పందిస్తూ వచ్చారు. దాంతో అంతా సైలెంట్ అయ్యారు. అయితే ఐశ్వర్య రాయ్ బర్త్‌డే నుంచి మళ్లీ వీరి డైవోర్స్ రూమర్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఎందుకంటే తన బర్త్‌డేను ఐశ్వర్య తన కూతురు ఆరాధ్య, ఆమె తల్లితో మాత్రమే కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన అత్తమామ ఆమెకు విష్ చేసినట్టు కూడా కనిపించలేదు. ఇక భర్త అభిషేక్ అయితే హ్యాపీ బర్త్‌డే అంటూ సింపుల్ విష్‌తో కానిచ్చేశాడు. అదీ కూడా లేటుగా. మరోవైపు ఐశ్వర్య ప్రేమగా ఇచ్చిన ఉంగరాన్ని అభిషేక్ తీసేశాడని అనే టాక్ కూడా వినిపించింది.
మీరు మరింత ప్రకాశించాలి..
అప్పటి నుంచి ఐశ్వర్య-అభిషేక్ విడాకులు వార్తలు మరింత పుంజుకున్నాయి. ఏదోక సందర్భంలో వారి డైవోర్స్‌పై బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తమ డైవర్స్ రూమర్స్‌కి తాజాగా ఐష్ చెక్ పెట్టింది. నిన్న(ఫిబ్రవరి 5) తన భర్త అభిషేక్ 48వ వసంతంలోకి అడుగుపెట్టాడు. భర్త పుట్టిన రోజు సందర్భంగా ఐశ్వర్య ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. కూతురు ఆరాధ్య, అభిషేక్‌తో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపింది. "మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంతో, ప్రేమతో, శాంతి, ప్రశాంతంగా జీవించాలని.. ఆ దేవుడి కృపతో మరింత ప్రకాశించాలని ఆశిస్తున్నా" అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా అభిషేక్ వింటేజ్ ఫొటోను కూడా షేర్ చేసింది.
View this post on Instagram
ఐష్ షేర్ చేసిన ఫ్యామిలీ పిక్‌లో ముగ్గురు రెడ్ కలర్ దుస్తుల్లో మెరిశారు. దీంతో ఈ జంట ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. 'థ్యాంక్యూ మేడం.. ఈ పోస్ట్‌తో మీ విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మేము చాలా హ్యాపీ','విడాకుల వార్తలకు ఒక్క పోస్ట్‌తో తేల్చేసింది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో బర్త్‌డేను ఫుల్ సెలబ్రెట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి అభిషేక్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక ఐశ్వర్య పోస్ట్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇకనైన వారిని టార్గెట్ చేయడం ఆపండని, తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానేయండంటూ గాసిప్ రాయుళ్లకు కౌంటర్ ఇస్తున్నారు.