Mahesh Babu Rajamouli Film: మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సీక్వెల్? - క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్!
రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రూపొందుబోతున్న తాజా చిత్రం SSMB29. ఈ సినిమా గురించి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక విషయాలు వెల్లడించారు. పనిలో పనిగా క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో వివరించారు.
దర్శకధీరు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB29. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతోంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించారు.
SSMB29లో ఆ మూవీ ఛాయలు కూడా ఉంటాయి- విజయేంద్ర ప్రసాద్
వాస్తవానికి ఈ సినిమా కథ కోసం కొద్ది నెలలుగా వర్కౌట్ నడుస్తోంది. ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ మూవీగా ఉండబోతోందని దర్శకుడు రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. ఇదే విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్ ధృవీకరించారు. మహేష్ – రాజమౌళి సినిమాలో ఇండియానా జోన్స్ తో పాటు మరో చిత్రం లక్షణాలు ఉండబోతున్నట్లు తెలిపారు. ఆ చిత్రం మరేదో కాదు, 1981లో విడుదలైన సంచలన విజయాన్ని అందుకున్న ‘రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’. ఈ సినిమా కూడా అడ్వెంచరస్ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ రూపొందించారు. SSMB29కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జూలై నాటికి కంప్లీట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాలో కావాల్సినంత థ్రిల్, అంతకు మించి ఎమోషన్ ఉంటుందన్నారు. స్క్రిప్టు పూర్తయ్యాక, కనీసం 6 నెలల పాటు ప్రీ ప్రొక్షన్ పనులు కొనసాగే అవకాశం ఉందన్నారు.
SSMB29 సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ!
అటు ఈ సినిమా క్లైమాక్స్ గురించి కూడా కీలక విషయాలు తెలిపారు. ఇందులో క్లైమాక్స్ లో కథ ఎండ్ చేయకుండా, వదిలేస్తున్నట్లు తెలిపారు. అలా వదిలేయడం వల్ల సీక్వెల్ కు ఉపయోగపడుతుందన్నారు. అంటే కచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాను మహేష్ బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9న మొదలు పెడతారని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ 2024 సమ్మర్ నుంచి నుంచి షురూ కావచ్చని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ చిత్రంలో విలువైన వస్తువుల అన్వేషణలో మహేష్ బాబు గ్లోబల్ ట్రాటింగ్ ఎక్స్ ప్లోరర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇండియానా జోన్స్ సిరీస్ ఛాయలతో పాటు భారతీయ సంస్కృతి, పురాణాలు, చరిత్రలో లోతుగా పాతుకుపోయిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. తొలిభాగం భారత్, ఆఫ్రికాలో మాత్రమే కాకుండా, వివిధ దేశాలలో షూట్ చేయనున్నట్లు సమాచారం. ఎందుకంటే, ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎంతకాలం పడుతుంది అనేది మాత్రం తెలియదు.
Also Read : మీనాక్షి, ఫరియా, సంయుక్త - 'గుంటూరు కారం' హీరోయిన్ రేసులో ముగ్గురు?
మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, రాజమౌళితో చేయబోయే సినిమా మరో ఎత్తు అవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజమౌళితో సినిమా చేయడం నిజంగా మహేష్ బాబు లక్ అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఫ్యాన్స్ ను బాగా అలరిస్తోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
Read Also: ప్రేమలో సల్మాన్ మోసపోయాడు, అతనికి హోమ్లీ వైఫ్ కావాలి - ఆస్ట్రాలజర్ బేబీకా
Join Us on Telegram: https://t.me/abpdesamofficial