గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బిడ్డతో కలిసి మెగా కపుల్ మీడియా ముందుకు వచ్చారు. జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులు చూపిస్తున్న ప్రేమకు మాటలు రావడం లేదన్నారు రామ్ చరణ్. ఉపాసన, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. పెళ్ళైన 11 ఏళ్ళకు రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. పాప, బాబు... ఎవరు పుట్టినా ఏం పేరు పెట్టాలనేది ముందుగా ఉపాసన, తాను మాట్లాడుకున్నామని రామ్ చరణ్ చెప్పారు. అయితే... పాపకు ఏం పేరు పెట్టారనేది రామ్ చరణ్ చెప్పలేదు. ప్రస్తుతానికి రహస్యంగా ఉంచారు. నామకరణం రోజున పాప పేరును అధికారికంగా వెల్లడిస్తామని రామ్ చరణ్ చెప్పారు. మీడియా ముందుకు వచ్చినప్పటికీ... పాప ముఖం బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. అపోలో ఆస్పత్రి వద్ద పాపతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు!