'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నందిత శ్వేత. ఇక ఆ తర్వాత తెలుగులో 'శ్రీనివాస కళ్యాణం', 'కపటదారి', 'సెవెన్', 'కల్కి', ప్రేమ కథా చిత్రం 2' 'బ్లఫ్ మాస్టర్', 'అక్షర' సినిమాల్లో నటించింది. ఈ సినిమాలేమీ తెలుగులో ఈమెకు హీరోయిన్గా గుర్తింపును తేలేకపోయాయి. దాంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి జంప్ అయింది. అక్కడ పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా తెలుగు బుల్లితెరపై ఢీ డ్యాన్స్ షోలో జడ్జి గా కూడా ఆకట్టుకుంది. ఇక తెలుగులో కొంత గ్యాప్ తర్వాత 'హిడింబా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హీరోయిన్ నందితా శ్వేతా లేటెస్ట్ వీడియో.. Photo Credit: Nandita Swetha/Instagram