యోగాను దినచర్యలో భాగం చేసుకున్న స్టార్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.

రకుల్ ప్రీత్ సింగ్ కు యోగా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఖాళీ దొరికిందంటే చాలు.. షూటింగ్ లేని సమయాల్లోనూ ఆమె యోగా చేస్తూ.. ఆ ఫొటోను కూడా షేర్ చేయడం చూస్తూనే ఉంటాం.

ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ.. సరైన వ్యాయామాలు చేస్తూ అందం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సాగుతోన్న బ్యూటీ రకుల్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. రకుల్ ఓ వీడియో షేర్ చేసింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. రకుల్ ఓ వీడియో షేర్ చేసింది.

వివిధ యోగాసనాలతో భంగిమల్లో కనిపిస్తోన్న రకుల్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

యోగా ఒక జీవన విధానం అని, ఈ జ్ఞానోదయ మార్గంలో తనను నడిపించిన అనుష్క యోగా సెంటర్ కు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని రకుల్ రాసుకొచ్చింది.

ఇటీవల విడుదలైన 'ఐ లవ్ యు' చిత్రంలో తన అద్భుతమైన నటనతో రకుల్ అలరించింది. ఈ సినిమా ద్వారా మళ్లీ.. తన ఆమె టాలెంట్ ను నిరూపించుకుంది.

అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు, పాత్రకు ఆమె చేసిన న్యాయంపై విమర్శకుల చేత సైతం ప్రశంసలు అందుకుంది.

Image Credits : Instagram