Mahesh Babu : రీజినల్ సినిమాతోనే రికార్డుల తాట తీస్తున్న మహేష్ - ఏకంగా 5 సినిమాలతో అరుదైన ఘనత!
Mahesh Babu : రీజనల్ సినిమాతోనే ఏకంగా 5 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా మహేష్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
Mahesh achieves a unique feat with Guntur Kaaram : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం రీజనల్ సినిమాలతోనే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈమధ్య యంగ్ సైతం పాన్ ఇండియా బాట పడుతుంటే ఇప్పటివరకు మహేష్ దాని జోలికి వెళ్లకుండా నాన్ - పాన్ ఇండియా సినిమాతోనే బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'గుంటూరు కారం' మిక్స్డ్ టాక్ తోనే భారీ కలెక్షన్స్ అందుకుంది. సినిమాకి పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. రివ్యూలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి. కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. ఇప్పటికే 'గుంటూరు కారం' బాక్స్ ఆఫీస్ వద్ద రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఇదిలా ఉంటే 'గుంటూరు కారం' తో మహేష్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. కేవలం రీజనల్ సినిమాతోనే రూ.100 కోట్ల షేర్ అందుకున్న హీరోగా మహేష్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు సినిమాలతో రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఈ రికార్డు సాధించాడు. 'భరత్ అనే నేను' సినిమా నుంచి మొదలు పెడితే ఆ తర్వాత వచ్చిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట ఇప్పుడు గుంటూరు కారం.. సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వందకోట్ల షేర్ కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించాయి. ఇప్పటివరకు మరే హీరో కూడా సింగిల్ లాంగ్వేజ్ ఈ రికార్డ్ సాధించలేదు. కానీ మహేష్ మాత్రం ఐదు సార్లు ఈ రికార్డును క్రియేట్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు.
దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. జస్ట్ రీజినల్ సినిమాతోనే ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ రాజమౌళితో చేసే పాన్ వరల్డ్ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక 'గుంటూరు కారం' సినిమా విషయానికొస్తే.. జనవరి 12న విడుదలైన 'గుంటూరు కారం' సినిమాకు మొదటి నుంచి మిక్స్డ్ టాక్ ఉంది. అయితే మహేష్ బాబు స్టార్ క్రేజ్ థియేటర్లకు ప్రేక్షకులను తీసుకు రావడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. మొదటి నాలుగు రోజులు సినిమాకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చాయి. సంక్రాంతి హాలిడేస్ తర్వాత కలెక్షన్స్ కాస్త తగ్గిపోయాయి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఇంతకు ముందు 'అతడు', 'ఖలేజా' సినిమాలు చేశారు. సుమారు 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ మహేష్ - త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడం, పైగా టీజర్, ట్రైలర్ మాస్ గా ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మీనాక్షి చౌదరి మహేష్ మరదలిపాత్రలో సందడి చేశారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, వెన్నెల కిశోర్, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
Also Read : థియేటర్లలో బంధించి హింసను చూపిస్తున్నారు - ‘యానిమల్’పై తమిళ నటుడు బాలాజీ ఘాటు వ్యాఖ్యలు