Mr. Bachchan : జెట్ స్పీడ్‌లో 'మిస్టర్ బచ్చన్' షూటింగ్ - నయా షెడ్యూల్ కోసం అక్కడికెళ్లిన మూవీ టీమ్
Mr.Bacchan : రవితేజ 'మిస్టర్ బచ్చన్' లేటెస్ట్ షెడ్యూల్ ని కార్తెకుడిలో ప్లాన్ చేశారు. మూవీ టీం ఇందుకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
Latest update about Ravi Teja and Harish Shankar’s Mr. Bachchan : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. త్వరలోనే 'ఈగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హీరో ప్రజెంట్ 'మిస్టర్ బచ్చన్' షూటింగ్ లో ఉన్నాడు. టాలీవుడ్ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'షాక్' నిరాశపరచగా ఆ తర్వాత రిలీజ్ అయిన 'మిరపకాయ్' భారీ సక్సెస్ అందుకుంది. మళ్లీ 13 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ - రవితేజ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని కర్తెకుడిలో ప్లాన్ చేశారు. సినిమాలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ కోసం మూవీ టీం తాజాగా కరైకుడికి వెళ్ళింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కలిసి ఫ్లైట్ లో కర్తెకుడి కి వెళ్తున్న ఫోటోలను మూవీ టీం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాని హిందీలో అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' సినిమా ఆధారంగా తెరకెక్కించబోతున్నారు.
Gearing up for another
— Harish Shankar .S (@harish2you) January 24, 2024
FUNtastic schedule 🤗🤗 https://t.co/ZUv0DbGk69
రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ 'రైడ్' సినిమాను తీశారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్ పై దాదాపు మూడు రోజులపాటు జరిపిన ఇన్ కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పుడు ఇదే సినిమాని ఆధారంగా చేసుకుని 'మిస్టర్ బచ్చన్' మూవీని తన స్టైల్ లో రవితేజ ఇమేజ్ కి తగినట్లుగా కమర్షియల్ అంశాలను కలిపి హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు. ఇందులో రవితేజ సరసన బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. ఇంతకు ముందు హిందీలో 'యారియాన్ 2' సినిమాలో నటించింది పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
ఇక రవితేజ 'ఈగల్' విషయానికొస్తే.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ సంక్రాంతి బరిలో వరుస సినిమాలు పోటీ ఉండటంతో ఇండస్ట్రీ నిర్మాతలు ఈగల్ సినిమాని సంక్రాంతి రేసు నుంచి తప్పించారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదలకు ముస్తామవుతుంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై ఆసక్తిని పెంచాయి. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.
Also Read : ఈసారి ఏడిపించను, అంతా ఎంటర్‌టైన్మెంటే - ‘ఫ్యామిలీ స్టార్’పై మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్