Krishna Vamsi: వద్దని చెప్పినా.. ప్రభాస్ ఆ సినిమానే చేస్తా అన్నాడు, అక్కడే మిస్ అయ్యింది - కృష్ణవంశీ కామెంట్స్
Chakram Movie: ప్రభాస్, కృష్ణవంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘చక్రం’ ఎంతోమందికి ఫెవరెట్‌గా నిలిచిన కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఫెయిల్యూర్‌పై దర్శకుడు స్పందించారు.
Krishna Vamsi about Chakram Movie: సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ సినిమా అంటే ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎదురుచూసేవారు. కలిసి థియేటర్లకు వెళ్లాలని అనుకునేవారు. తన కథలలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే అంశాలతో పాటు క్రియేటివిటీని కూడా కలుపుతారు కాబట్టే కృష్ణవంశీకి క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు వచ్చింది. కానీ ఆయన చేసిన అన్ని సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ను మాత్రం సాధించలేకపోయాయి. అందులో ‘చక్రం’ ఒకటి. ఈ సినిమాకు బెస్ట్ డైరెక్టర్‌గా కృష్ణవంశీ నందీ అవార్డు అందుకున్నా కూడా కమర్షియల్‌గా మాత్రం మూవీ డిసాస్టర్‌గా నిలిచింది. అసలు దాని వెనుక కారణమేంటో బయటపెట్టాడు ఈ దర్శకుడు. అంతే కాకుండా క్యాస్టింగ్ కౌచ్‌పై కూడా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
ప్రభాస్ పట్టుపట్టాడు..
‘‘ప్రభాస్‌కు అది తప్పు ప్రాజెక్ట్. అది ప్రభాస్‌కు కూడా ముందే చెప్పాను. ఇలాంటిది కాదని ఒక యాక్షన్ ఫిల్మ్ చెప్పాను. అందరూ నాతో యాక్షన్ ఫిల్మే చేస్తున్నారు సార్, నాకు మంచి స్టోరీ ఓరియెంటెడ్ సినిమా కావాలి అన్నాడు. అప్పుడే బాలీవుడ్‌లో కొందరు స్టార్ హీరోలు కొన్ని మంచి సినిమాలు చేశారు. అలాంటిదే ఇక్కడ చేద్దామని అన్నాడు. అప్పుడే నా దగ్గర ‘చక్రం’ ఐడియా ఉందని చెప్పాను. అప్పటినుండే అదే చేస్తాను అని ప్రభాస్ పట్టుపట్టాడు. దానికోసమే ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్టుగా ఉండాలని యాక్షన్ సీన్స్, ఒక ఫైట్ పెట్టించాం. అక్కడే మిస్ అయ్యింది అది. తను చాలా కష్టపడ్డాడు. ప్రభాస్‌కు ఒక వర్సటైల్ యాక్టర్‌గా అన్నీ స్టైల్స్ ట్రై చేయాలని ఉంది. అలా రకరకాల క్యారెక్టర్స్ చేద్దామని ప్రతీ యాక్టర్‌కు ఉంటుంది’’ అంటూ అసలు ప్రభాస్‌తో ‘చక్రం’ తెరకెక్కించిన పరిస్థితుల గురించి చెప్పారు కృష్ణవంశీ.
ప్రతీచోటా ఉంది..
ఇండస్ట్రీలో దుమారం రేపిన క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా కృష్ణవంశీ.. తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘‘ఒక్క సినిమా ఇండస్ట్రీ అనే కాదు. అన్ని చోట్లా ఇది ఉంది. ఆడవారిని దోచుకోవడం అనేది ఉంది. అంతకు మించి దానిమీద పెద్దగా నేనేం చెప్పలేను. నా సెట్స్‌లో మాత్రం అలాంటివి జరగకుండా ఉండేలాగా నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నిస్తాను. అస్సలు ఒప్పుకోను. అమ్మాయిలతో, జూనియర్ ఆర్టిస్టులతో, ఇంకా ఎవరితో అయినా తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని తెలిస్తే మాత్రం సీరియస్ అవుతాను. అంతవరకు నేను కంట్రోల్ చేయగలను. అది దాటిన తర్వాత నాకు తెలీదు’’ అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి మట్లాడారు.
అదే నా డ్రీమ్..
ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూలో అసలు తన కోరిక ఏంటో బయటపెట్టారు కృష్ణవంశీ. నాలుగైదు ఏళ్లలో అన్నింటిని వదిలేసి వెళ్లిపోయి నేచర్ మధ్యలో బ్రతకాలని ప్లాన్ చేస్తున్నానని రివీల్ చేశారు. ఆయనకు అలా ప్రకృతి మధ్య ఉండడం ఇష్టమన్నారు. ఇక ‘చక్రం’ సినిమా విషయానికొస్తే.. 2005లో విడుదలయిన ఈ మూవీ అప్పటి ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్టుగా లేదని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికీ ఈ సినిమాను, ఇందులోని పాటలను అభిమానించే వారు ఉన్నారు. పైగా అలా కమర్షియల్‌గా హిట్ అవ్వని సినిమాకే కృష్ణవంశీకి నందీ అవార్డ్ దక్కడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ దర్శకుడు చివరిగా ప్రకాశ్ రాజ్ లీడ్ రోల్‌లో ‘రంగమార్తాండ’ అనే చిత్రం చేశారు.
Also Read: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ - ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు