అన్వేషించండి

Krish Jagarlamudi: రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో దర్శకుడు క్రిష్ - ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు

Drugs Case - Krish Jagarlamudi: సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

Radisson hotel drug case: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు మరోసారి కలకలం రేపుతోంది. అందుకు కారణం ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) పేరు ఎఫ్ఐఆర్ కాపీలో ఉండటమే. గతంలో పలువురు ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపించగా... ఈసారి ఫీల్ గుడ్, మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ దర్శకుడు క్రిష్ పేరు రావడంతో సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన క్రిష్ పేరు!
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరాలు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందడంతో రాడిసన్ హోటల్ (radisson hotel drug case fir copy)కు వెళ్లామని, అక్కడ రాడిసన్ హోటల్ అధినేత గజ్జల యోగానంద్ కుమారుడు వివేకానంద్ స్నేహతులతో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు తెలిసిందని, తర్వాత అతణ్ణి విచారించగా డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.

Also Readఅందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు

హోటల్‌కు వెళ్లిన మాట నిజమే కానీ...
ఎఫ్ఐఆర్ కాపీలో క్రిష్ పేరును 8వ వ్యక్తిగా చేర్చారు. అయితే... డ్రగ్స్ కేసు పట్ల ఓ న్యూస్ ఛానల్‌తో క్రిష్ మాట్లాడారు. తాను హోటల్‌కు వెళ్లిన విషయం నిజమేనని, అయితే సాయంత్రం అక్కడికి వెళ్లి అరగంట పాటు ఉన్న తర్వాత 6.45 గంటలకు వచ్చేశానని, ఆ విషయం పోలీసులకు తెలియజేయగా... వారు ఒక స్టేట్మెంట్ అడిగినట్లు క్రిష్ జాగర్లమూడి పేర్కొన్నారు.

Also Readథియేటర్లలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలుగు సినిమాలు ఇవే!

కుషిత కళ్ళపు చెల్లెలు లిషి గణేష్ పేరు కూడా!
రాడిసన్ డ్రగ్స్ కేసులో నటి కుషితా కళ్ళపు చెల్లెలు లిషి గణేష్ పేరు కూడా ఉంది. ఆమె కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించారు. వాటిలో 'జియోమెట్రీ బాక్స్‌' ఒక మోస్తరు గుర్తింపు తెచ్చింది. లిషితో పాటు కుషిత పేరు 2022లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కూడా వినిపించింది. మింక్‌ పబ్‌ డ్రగ్‌ కేసులో వాళ్ళిద్దరి పేర్లు వచ్చాయి. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండించారు. చీజ్‌ బజ్జీలు తినడానికి మాత్రమే తాము హోటల్ దగ్గరకు వెళ్లామని చెప్పుకొచ్చారు. ఆమె సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమెను నెటిజన్లు బాగా ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్‌ పేరు రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో వినిపించడం చర్చనీయాంశం అయింది. లిషితో పాటు శ్వేత అనే వీఐపీ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చేర్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget