అన్వేషించండి

Upcoming Movies: థియేటర్లలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలుగు సినిమాలు ఇవే!

March 1 movie releases in Telugu: థియేట్రికల్ రిలీజుల పరంగా ఫిబ్రవరి నెల ఎండ్ అయినట్లే! ఈ వారంలో విడుదలయ్యే సినిమాలు అన్నీ మార్చి 1 మీద కర్చీఫ్ వేశాయి. థియేటర్లలోకి వస్తున్న ఆ సినిమాలు ఏవో చూడండి.

Upcoming Telugu movies in March 2024: మార్చిలో కొత్త సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. థియేట్రికల్ రిలీజుల పరంగా ఫిబ్రవరి ముగిసినట్లే. ఇప్పుడు... ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలు అన్నీ మార్చిలో 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి. వాటిలో కొత్త సినిమాలతో పాటు రీ రిలీజు సినిమాలు సైతం ఉన్నాయి. మరి, ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఏవో చూడండి. 

'ఆపరేషన్ వేలంటైన్'తో వరుణ్ తేజ్ రెడీ!
Operation Valentine: ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ముందడుగు వేసే యువ తెలుగు హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. ఆయన నటించిన తాజా సినిమా 'ఆపరేషన్ వేలంటైన్'. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. హృతిక్ రోషన్ హిందీ సినిమా 'ఫైటర్' జానర్ అని చెప్పవచ్చు.

'ఆపరేషన్ వేలంటైన్'తో మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. వరుణ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే ఇది వైవిధ్యంగా ఉంటుందని, తప్పకుండా సినిమాను ఆదరించాలని ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేశారు. ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందో చూడాలి. 

మార్చి 1న అబ్బాయ్... 2న బాబాయ్!
Simhadri vs Samarasimha reddy - Re release movies in March 1st week: మార్చి ఫస్ట్ వీక్ స్పెషాలిటీ ఏమిటంటే... నందమూరి బాబాయ్ - అబ్బాయ్ బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. మార్చి 1న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'సింహాద్రి' రీ రిలీజ్ అవుతుంటే... మార్చి 2న గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'సమరసింహా రెడ్డి' రీ రిలీజ్ కానుంది.

చారి... గూఢచారిగా 'వెన్నెల కిశోర్'
Chaari 111 movie: ప్రముఖ హస్యనటుడు వెన్నెల కిశోర్ హీరోగా నటించిన కొత్త సినిమా 'చారి 111'. స్పై యాక్షన్ కామెడీ జానర్ చిత్రమిది. చారి... బ్రహ్మచారి అంటూ గూఢచారి పాత్రలో నవ్వించడానికి వస్తున్నారు 'వెన్నెల' కిశోర్! ఒక కమెడియన్ లీడ్ రోల్ చేయాల్సిన సినిమా అని, అందుకే చేశానని ఆయన తెలిపారు. 'పింక్ పాంథర్', 'జానీ ఇంగ్లీష్' వంటి హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో సినిమా చేశానని దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ చెప్పారు. లేటెస్ట్ యూట్యూబ్ సెన్సేషన్ 'కట్చి సేరి' సాంగ్ ఫేమ్ సంయుక్తా విశ్వనాథన్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ నవ్వించింది. మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also Readఅందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు

శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ', 'మా ఊరి రాజారెడ్డి', 'ఇంటి నెంబర్ 13', 'రాధా మాధవం' సినిమాలు సైతం మార్చి 1న విడుదల అవుతున్నాయి. 

హాలీవుడ్ 'డ్యూన్ 2' కూడా ఆ రోజునే...
ఆమిర్ ఖాన్ నిర్మించిన 'లాప్తా లేడీస్'
మార్చి 1న ఇంట్రెస్టింగ్ హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. 'డ్యూన్ 2' కోసం తెలుగు ఆడియన్స్, ముఖ్యంగా మల్టీప్లెక్స్ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇక... హిందీలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'లాప్తా లేడీస్' సైతం మార్చి 1న థియేటర్లలో విడుదల అవుతోంది.

Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు, పవన్‌ కళ్యాణ్ తో నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
Embed widget