అన్వేషించండి

Krish Jagarlamudi : 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి తప్పుకున్న క్రిష్ - కారణం ఇదేనా?

Krish Jagarlamudi : పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి దర్శకుడిగా క్రిష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Krish Exits From Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో సినిమా షూటింగ్స్ పక్కన పెట్టిన పవర్ స్టార్ ప్రస్తుతం రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. మళ్లీ ఎలక్షన్స్ తర్వాత పవన్ కమిట్ అయిన సినిమా షూటింగ్స్ పూర్తి చేసే అవకాశం ఉంది. పవన్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతోంది.

గతంలో పవన్ కల్యాణ్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ చిన్న విడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు మాత్రం వరుస షూటింగ్ లు పూర్తి చేసుకుంటుంటే ఈ మూవీ మాత్రం ఏదొక కారణంతో ఆలస్యం అవుతూ వస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలాంటి పిరియాడికల్ రోల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

పవన్ సినిమా నుంచి తప్పుకున్న క్రిష్

'‘హరిహర వీరమల్లు’' సినిమాని 2020లో మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు  రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. పవన్ ఈ సినిమా కోసం పవన్ ఇచ్చిన డేట్స్ ని క్రిష్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని షూటింగ్ చేయడంలో విఫలమయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అవుట్ పుట్ చూసి పవన్ అసంతృప్తిగా ఉన్నారని, కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసినా కూడా పవన్ కి నచ్చలేదని చెబుతున్నారు.

ఇప్పుడు క్రిష్, పవన్ కళ్యాణ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు, దానికి తోడు బడ్జెట్ సమస్యలు, అలాగే పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం నిర్మాత ఏ.ఎం.రత్నం చాలా ఖర్చు పెట్టాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి దర్శకుడిగా తప్పుకున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు ఆయన స్థానంలో మరో డైరెక్టర్ ‘హరిహర వీరమల్లు’ పెండింగ్ షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అనుష్క తో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్

‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారట. క్రిష్ ఇప్పటికే క స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తారని, UV క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని అంటున్నారు త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Also Read : అలా చేయడం అవసరమా - హీరోయిన్స్‌తో రామ్ చరణ్ ఇంటిమేట్ సీన్స్‌పై ఉపాసన రియాక్షన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget