Upasana Konidela: అలా చేయడం అవసరమా - హీరోయిన్స్‌తో రామ్ చరణ్ ఇంటిమేట్ సీన్స్‌పై ఉపాసన రియాక్షన్
Upasana Konidela: ఉపాసన, రామ్ చరణ్ పెళ్లయ్యి 11 ఏళ్లు అయ్యింది. రెండు వేర్వేరు ప్రపంచాల నుండి రావడం వల్ల మొదట్లో ఉపాసనకు రామ్ చరణ్ ప్రొఫెషన్ గురించి అర్థమయ్యేది కాదని తాజాగా బయటపెట్టారు.

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల.. తన సామాజిక సేవల వల్ల, కార్యక్రమాల వల్ల ఎక్కువశాతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన.. తనది, రామ్ చరణ్‌ది రెండు వేర్వేరు ప్రపంచాలు అని, అందుకే పెళ్లయిన కొత్తలో తన వర్క్‌ను అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉండేదని బయటపెట్టారు. నిజంగానే రామ్ చరణ్, ఉపాసన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ చాలా వేరు. సినిమా ఇండస్ట్రీలోకి ఏ సాయం లేకుండా అడుగుపెట్టి స్టార్ అయిన మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ అయితే.. పూర్తిగా బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి ఉపాసన. అందుకే పెళ్లయిన కొత్తలో వారి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయో ఉపాసన చెప్పుకొచ్చారు.
అవసరమా..
సినిమాల్లో హీరోలు.. హీరోయిన్స్‌తో సన్నిహితంగా ఉండే సీన్స్ చాలానే ఉంటాయి. అలాగే రామ్ చరణ్ సినిమాల్లో కూడా ఉన్నాయి. కానీ పెళ్లయిన కొత్తలో అలాంటి సీన్స్ ఉపాసనకు నచ్చేవి కాదని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ‘‘మిగతా ఆడవారిలాగానే నేను కూడా హీరోయిన్స్‌తో అలాంటి సీన్స్ అవసరమా అని చాలాసార్లు అడిగాను. ఆ సీన్స్ చూసి ఏంటిది అని అడిగేదాన్ని’’ అని బయటపెట్టారు ఉపాసన కొణిదెల. కానీ రామ్ చరణ్ మాత్రం ఉపాసన ప్రశ్నలకు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అర్థమయ్యేలా చెప్పేవాడని చెప్పుకొచ్చారు. అలా సమయం గడిచేకొద్దీ తనకు రామ్ చరణ్ ప్రొఫెషన్ గురించి అర్థమయ్యి.. మళ్లీ అలాంటి సమస్యలు రాలేదని ఉపాసన అన్నారు.
ఇది నా ప్రొఫెషన్..
‘‘ఎందుకు ఇదంతా అని అడిగినప్పుడు తను ప్లీజ్ అర్థం చేసుకో. ఇది నా ప్రొఫెషన్. ఇలాగే ఉంటుంది. టెక్నికాలిటీస్ అన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఇప్పుడు అంతా పర్వాలేదు. మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు. మేము రెండు వేర్వేరు ప్రపంచాల నుండి వచ్చాం. కానీ తనకు చరణ్‌కు నాతో తప్పా అంత మంచి కెమిస్ట్రీ ఎవరితోనూ లేదు. తను నాతోనే బెస్ట్‌గా కనిపిస్తాడు’’ అంటూ వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పారు ఉపాసన కొణిదెల. రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత క్లిన్ కారా జన్మించింది. ఇక పెళ్లయిన చాలాకాలం వరకు పిల్లలు లేకపోవడంపై వారిని ఎందరో విమర్శించినా.. తను మాత్రం అవన్నీ పట్టించుకోనని అంటున్నారు ఉపాసన.
ఎప్పటికీ డాడీ గర్లే..
‘‘క్లిన్ ఎప్పటికీ డాడీ గర్లే. శక్తి అనేది మనసు లోపల నుండి వస్తుంది. మేమిద్దరం తల్లిదండ్రులుగా తన జీవితంలో కీలక పాత్రలు పోషించాలి. తల్లి అంటే ఇలా ఉండాలి అని అంచనాలు ఎలా ఉంటాయో.. తండ్రి అంటే ఎలా ఉండాలో అంతకంటే ఎక్కువ అంచనాలే ఉంటాయి. మేమిద్దరం సమానంగా కారాను పెంచడంలో పాలుపంచుకుంటున్నాం. అదే అందమైన విషయం. రామ్ ఎప్పుడూ తన కూతురికి అందుబాటులో ఉంటాడు. తను కూడా డాడీ గర్లే. ఇది చూస్తుంటే నాకు అసూయగా ఉంటుంది. తను నాన్నకు చూడగానే తన మొహం వెలిగిపోతుంది. స్పెషల్‌గా నవ్వుతుంది. కళ్లలో మెరుపు వస్తుంది’’ అంటూ రామ్ చరణ్‌కు, క్లిన్ కారాకు ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు ఉపాసన.
Also Read: చింపాంజీతో వెంకటేష్‌కు పెళ్లి - అందుకే నాగార్జునతో ఆ మూవీ ఆగింది: ఎస్వీ కృష్ణారెడ్డి
Before You Go
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















