SV Krishna Reddy: చింపాంజీతో వెంకటేష్‌కు పెళ్లి - అందుకే నాగార్జునతో ఆ మూవీ ఆగింది: ఎస్వీ కృష్ణారెడ్డి
SV Krishna Reddy: దర్శకుడిగా ఎంతో గుర్తింపు సాధించిన ఎస్వీ కృష్ణారెడ్డి.. పెద్ద స్టార్లతో ఎప్పుడూ సినిమాలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దానికి గల కారణాన్ని తాజాగా బయటపెట్టాడు.
SV Krishna Reddy: టాలీవుడ్‌లో పెద్దగా స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా.. స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు ఎస్వీ కృష్ణారెడ్డి. అప్‌కమింగ్ నటులతోనే ఫ్యామిలీ సినిమాలు తెరకెక్కించి ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎక్కువశాతం అప్పటి సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆయనకు ఛాన్స్ వచ్చినా కూడా ఎస్వీ.. ఆ ప్రాజెక్ట్స్‌ను పట్టాలు ఎక్కించలేకపోయారు. దాని వెనుక కారణాన్ని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టారు. నాగార్జునలాంటి స్టార్‌తో ప్రాజెక్ట్ ఎలా వర్కవుట్ అయ్యిందో.. వెంకటేశ్‌తో ఎందుకు వర్కవుట్ అవ్వలేదో రివీల్ చేశారు. అంతే కాకుండా వెంకటేశ్‌తో చేయాలనుకున్న సినిమా కథను కూడా చెప్పారు.
చింపాంజీతో సినిమా..
ఒక చింపాంజీని హీరోయిన్‌గా పెట్టి వెంకటేశ్ హీరోగా సినిమా చేయాలనుకున్నానని ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు ఎస్వీ కృష్ణారెడ్డి. చింపాంజీని పెళ్లికూతురు అని చెప్పకుండా తనతో వెంకటేశ్‌కు పెళ్లి చేయిస్తారని, ఆ తర్వాత చింపాంజీ వల్లే హీరోకు ఎలా బ్రతకాలో తెలుస్తుందని, హీరో హీరోయిన్‌ను కలిపి చింపాంజీ తిరిగి అడవికి వెళ్లిపోతుందని కథను వివరించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆ కథ విన్న వెంకటేశ్.. చింపాంజీ ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారట. ప్రయత్నం చేస్తాం, ప్రయత్నిస్తేనే కదా తెలిసేది అని సమాధానమిచ్చారట ఎస్వీ. వేరే కథతో వస్తే వెంకటేశ్ అవకాశం ఇస్తారేమో అని తెలిసినా.. తన కథ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం తనకు ఇష్టం ఉండదని తన మనస్తత్వాన్ని బయటపెట్టారు ఎస్వీ కృష్ణారెడ్డి.
నచ్చితే చేస్తారు..
‘‘ఇలాగే వెళ్తాను, ఇదీ కథ అని చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్లకి నచ్చితే చేయడం లేకపోతే ఊరుకోవడం అంతే. అందుకే నేను ఆ పెద్ద హీరోలు ఎవరితో నేను చేయలేదు. బాలకృష్ణకు కూడా ఒక్కటే సీన్ చెప్పాను. నాగార్జునతో రాకుమారుడు అనే సినిమా అనుకున్నాను. మంచి పట్టుతో ఉండే అద్భుతమైన కథ. నా దగ్గర ఇప్పటికీ సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో అది చేస్తానేమో కూడా’’ అంటూ నాగార్జునతో ఫిక్స్ అయిన ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చెప్పుకొచ్చారు ఎస్వీ కృష్ణారెడ్డి. అంతా ఫిక్స్ అయిన తర్వాత నిర్మాత వచ్చి బడ్జెట్ ఎక్కువ అని, తాను అప్పుల్లో ఉన్నానని చెప్పాడని, దీంతో నాగార్జునతో కలిసి ఏం చేయాలో చర్చించానని గుర్తుచేసుకున్నారు నాగార్జున.
రీమేక్ అయితే బెటర్..
‘‘నిర్మాత ఇలా చెప్తున్నాడు ఏది నిజమో, ఏది అబద్ధమో మనకు ఎలా తెలుస్తుంది. ఆలోచించుకొని చేస్తే బెటర్‌గా ఉంటుంది. నీ ఇష్టం’’ అని నాగార్జున అన్నారని ఎస్వీ కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఒక కథ ఓకే అవ్వకపోయినా.. ఏదైనా రీమేక్ కథ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారని, నాగేశ్వర రావు కూడా అదే సలహా ఇచ్చారని ఎస్వీ అన్నారు. అందుకే ‘స్పాదికమ్’ అనే మలయాళం సినిమాను తెలుగులో ‘వజ్రం’గా నాగార్జునతో రీమేక్ చేశారు ఎస్వీ కృష్ణారెడ్డి. 1995లో విడుదలయిన ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిలిచింది. దర్శకుడిగా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా సూపర్ సక్సెస్‌ఫుల్ అయిన ఎస్వీ.. తాను ఏఆర్ రెహమాన్‌కు ఇష్టమైన సంగీత దర్శకుడు అని చెప్పారని గర్వంగా చెప్పారు.
Also Read: ఇంట్లో ఒత్తిడి.. మళ్లీ పెళ్లికి సిద్ధమైన సమంత? - బంధువుల అబ్బాయితో పెళ్లట!