అన్వేషించండి

Keerthy Suresh: ఒక వ్యక్తి కావాలని తాకి, తలపై కొట్టాడు - చెంపచెల్లుమనిపించి పోలీసులకు పట్టించా..

Keerthy Suresh: మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో 'జయం' రవితో కలిసి తాజాగా ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

Keerthy Suresh: 'మహానటి' సినిమాతో నేషనల్‌ స్టార్‌ అయిపోయింది కీర్తి సురేష్‌. నటి సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమా కీర్తిని రాత్రిరాత్రే స్టార్‌ చేసింది. అచ్చం సావిత్రిలా ఒదిగిపోయి నటించి మహానటిగా గుర్తింపు పొందింది. ఈ మూవీ తర్వాత కీర్తి ఖాతాలో ఆ రేంజ్‌ హిట్‌ ఒక్కటి లేదనే చెప్పాలి. వరుస ప్లాప్స్‌ చూసిన ఆమెను 'సర్కారు వారి పాట' 'దసరా'  సినిమాలు నిలబెట్టాయి. ఇక ఇప్పుడు 'సైరన్‌' అంటూ పోలీసుల ఆఫిసర్‌గా తమిళ్‌ ఆడియన్స్‌ ముందుకు రాబోతోంది. ఫిబ్రవరి 16న 'సైరన్‌' థియేటర్లో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో 'జయం' రవితో కలిసి తాజాగా ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చింది.ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టింది.

View this post on Instagram
 
A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

స్క్రీన్‌పై సాఫ్ట్‌గా కనిపించి కీర్తిలో మాస్‌ యాంగిల్‌ కూడా ఉందంటూ గతంలో జరిగిన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "నేను నటిగా పరిచయం కాకముందు ఓ రోజు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాను. తిరిగి వెళ్లసరికి రాత్రి అయ్యింది. అప్పుడు మేమంతా రోడ్డుపై నడుస్తూ వెళుతున్నాం. అదే సమయంలో ఓ వ్యక్తి బాగా తాగేసి అటూ వైపు నడుస్తూ వస్తున్నాడు. నా వెనకాలకు రాగానే నన్ను తాకూతూ ముందు వెళ్లాడు. కావాలనే తాకడని అర్థమైంది. నాకు పట్టరానంత కోపం వచ్చింది. దీంతో అతడిని పట్టుకుని చెంప చెల్లుమనిపించాను. ఆ తర్వాత  అతడు కూడా నాపై దాడి చేశాడు. తలపై కొట్టాడు. నేను, నా స్నేహితులంతా అతడిని చితకబాది పోలీసులకు అప్పగించాం. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ రోజు రాత్రంతా అతడిని జైలులోనే ఉంచి ఉదయాన్ని వదిలిపెట్టారు" అంటూ కీర్తి చెప్పుకొచ్చింది. 

Also Read: ఈ పల్లెటూరు అమ్మాయి ఎవరంటూ అవమానించారు - బాడీషేమింగ్‌పై మృణాల్‌ కామెంట్స్‌

ఆమె మాటలు విని యాంకర్‌తో పాటు హీరో జయం రవి కూడా షాక్‌ అయ్యాడు. నీలో ఈ మాస్‌ యాంగిల్‌ కూడా ఉందా? అంటూ కీర్తి చూస్తూ సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా శివంగి అంటూ కీర్తిని ప్రశంసలతో ముంచెత్తున్నారు. కాగా మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి ఫలితాలతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తూ పోతుంది. లేడీ ఒరియంటెడ్‌, గ్లామర్‌ రోల్స్‌తో పాటు పాన్‌ ఇండియా చిత్రాల్లో ఆఫర్స్‌ కొట్టెస్తుంది. అలా తెలుగు, తమిళ్‌ భాషలోనే కాదు ఉత్తరాది ప్రేక్షకులను సైతం అలరిస్తుంది. తాజాగా జయం రవి కథానాయకుడిగా నటించిన  'సైరన్'  సినిమాలో కీర్తి పవర్ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది. ఇందులో హీరో జయం రవి చొక్క పట్టుకుని తీసుకువెళుతున్న పోస్టర్లో కీర్తి చాలా సీరియస్‌ లుక్‌లో కనిపించింది. ఈ సినిమా కోసం ఆమె దాదాపు 10 కిలోల బరువు పెరిగిందట.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Honda City Hybrid 2026: కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
Embed widget