అన్వేషించండి

Mrunal Thakur: ఈ పల్లెటూరు అమ్మాయి ఎవరంటూ అవమానించారు - బాడీషేమింగ్‌పై మృణాల్‌ కామెంట్స్‌

Mrunal Thakur: ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. అక్కడ నా బాడీని ఉద్దేశించి కామెంట్స్‌ చేశారు. అస్సలు సెక్సీగా లేనని, అందంగా కనిపించలేదుంటూ మొహం మీదే చెప్పారు

Mrunal Thakur About Body Shaming: సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది మరాఠి బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. నిజానికి ఆమె సినీ ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చింది. మొదట టీవీ సీరియల్స్‌తో నటించిన ఆమె మెల్లిగా వెండితెరపై మెరిసింది. సీతారామంకు ముందు హిందీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమె పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, సీతారామం సినిమా ఆమెను ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసింది. చక్కటి ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా అంత హిట్‌ అవ్వడానికి ఒక ముఖ్య కారణం 'సీత' క్యారెక్టర్‌ అని చెప్పొచ్చు. ఆ రోల్‌లో మృణాల్‌ ఠాకూర్‌ అంతలా ఒదిగిపోయారు. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది‌. 

సీత, యశ్న పాత్రలో ఒదిగిపోయింది..

ముఖ్యంగా యువరాణిగా చీరకట్టులో ఆమె అందంతో కుర్రకారును ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత 'హాయ్‌ నాన్న' సినిమాతోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఫేవరేట్‌ అయిపోయింది. యశ్నాగా తన పాత్రల్లో ఇమిడిపోయి, తెలుగింటి అమ్మాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయింది ఈ మరాఠి అమ్మాయి. ప్రస్తుతం స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న ఈ బ్యూటీ.. కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తాను బాడీషేమింగ్‌ను ఎదుర్కొన్నానంటూ వాపోయింది. ముఖ్యంగా హిందీలో సినిమాలు చేసే టైంలో చాలా ఇబ్బందులకు గురయ్యానంది.  

సెక్సీగా లేనన్నారు.. బరువు తగ్గాలంటూ..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "గతంలో నేను ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. అక్కడ నా బాడీని ఉద్దేశించి కామెంట్స్‌ చేశారు. 'మీరు అస్సలు సెక్సీగా లేరు.. నిజానికి పాత్ర సెక్సీ ఉంది.. కానీ ఆ పాత్రకు మీరు సెట్‌ కాలేదు. అంత అందంగా కనిపించలేదు'అంటూ దారుణంగా మాట్లాడారు. ఓ ఫొటోగ్రాఫర్ నా పాత్రను చూడకుండానే నా లుక్‌పై కామెంట్‌ చేశాడు. అతడు మరాఠీలో మాట్లాడుతూ మరో ఫొటోగ్రాఫర్‌తో ఇలా అన్నాడు. ఈ పల్లెటూరి అమ్మయి ఎవరు? అని అవమానకరంగా వ్యాఖ్యలు చేశాడు. కానీ ఆ తర్వాత అతడు మళ్లీ నాకు క్షమాపణలు చెప్పాడు" అంటూ చెప్పుకొచ్చింది. 

Also Read: లగ్జరీ కారు కొన్న 'యమదొంగ' హీరోయిన్ - కారు ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

పల్లేటూరు అమ్మాయిలా ఉందన్నారు

అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఏ సినిమా చేసినా తనలాగే ఉండేందుకు ఇష్టపడతానని, అప్పుడే తను పాత్రలో సులభంగా నటించగలని పేర్కొంది. "అయితే, ఓ సాంగ్‌లో నటించేటప్పుడు ఏకంగా నన్ను బరువు తగ్గమని సూచించారు. అప్పుడు నేను నా శరీర బరువు గురించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. అలాంటప్పుడు మీరేందుకు అంతగా ఫీల్‌ అవుతున్నారని గట్టిగా ఇచ్చిపడేశాను" అని చెప్పింది. అలా బాలీవుడ్‌లో తాను బాడీషేమింగ్‌ గురయ్యానంటూ మృణాల్‌ నాటి చేదు అనుభవాలను గుర్తుచేసుకుంది. 

కాగా మృణాల్‌ హిందీలో జెర్సీ, పిప్సా వంఇ చిత్రాల్లో నటించింది. ఇక ఆమె నెక్ట్స్‌ సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. సీతారామం, హాయ్‌ నాన్న సినిమాలతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఈ క్రేజ్‌లో విజయ్‌ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌లో హీరోయిన్‌ ఆఫర్‌ కొట్టేసింది. దీనితో పాటు తమిళంలో రాబోయే ఏఆర్‌ మురుగుదాస్‌-శివకార్తికేయన్‌ అప్‌కమ్మింగ్‌ ప్రాజెక్ట్‌కు ఆమె సెలెక్ట్‌ అయినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె హీరోయిన్‌ నటించనుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Stalin On Delimitation:  జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Grama Palana officers: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
Sharmila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Embed widget