అన్వేషించండి

Mamta Mohandas: లగ్జరీ కారు కొన్న 'యమదొంగ' హీరోయిన్ - కారు ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mamta Mohandas: రీసెంట్ గా 'రుద్రాంగ' సినిమాతో మళ్లీ తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది. తాజాగా ఆమె లగ్జరీ కారు కోనుగోలు చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. ఆమె కారు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mamta Mohandas Buy New Car మమతా మోహన్‌ దాస్‌.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మలయాళి నటి అయిన ఆమె తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచితమే. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా తనదైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హ్రదయాలను గెలుచుకుంది. 'యమదొంగ' మంచి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత.. క్రష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్‌, కేడీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే యమదొంగతో వచ్చిన గుర్తింపు మరే మూవీతో రాలేదు. టాలీవుడ్‌తో పాటు తమిళ్‌, కన్నడ భాషల్లోనూ నటించిన ఆమె అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక పెద్దగా సక్సెస్‌ కూడా లేకపోవడంతో ఆమెకు ఆఫర్స్‌ కరువయ్యాయి.

అదే సమయంలో త్రోట్‌ క్యాన్సర్‌ ఆమెను సినిమాలకు దూరం చేసింది. క్యాన్సర్‌ చికిత్స తీసుకుని కోలుకున్న ఈ బ్యూటీ ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా 'రుద్రాంగ' సినిమాతో మళ్లీ తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది. తాజాగా ఈ హీరోయిన్‌ సరికొత్త లగ్జరీ కారు కోనుగోలు చేసి అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. కారు కొన్న వీడియోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. బీఎమ్‌డబ్ల్యూ z4 M40i స్పోర్ట్స్‌ రోడ్‌స్టర్‌ మోడల్‌ కారు కొని తన గ్యారేజ్‌లో చేర్చుకుంది. దీని ధర సుమారుగా కోటీ రూపాయలు ఉంటుందని అంచనా. ఈ BMW లగ్జరీ కారు గత సంవత్సరం మే నెలలో భారత్‌ మార్కెట్లో విడుదల చేశారు. బీఎండబ్ల్యూ సంస్థ ఈ కారును జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BMW EVM Autokraft (@bmwevmautokraft)

ఈ కారు ప్రత్యేకతలు ఏంటంటే.. 

మమతా కొనుగోలు చేసిన ఈ బీఎండబ్ల్యూ Z4 M40i కారు 3.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. 340 bhp శక్తి, 500Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్‌ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో గరిష్ఠంగా 250 కి.మీ స్పీడ్‌తో దూసుకువెళుతుంది. అంటే కేవలం 4.5 సెకన్లలోనే దాదాపు 100 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే ఈ కారు ఫీచర్స్‌ చూస్తే అవాక్కవ్సాల్సిందే. దీని ఓపెన్‌టాప్‌ స్పోర్ట్స్‌ మోడల్‌ 19 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది. ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్ టాప్‌ జస్ట్‌ వన్‌ బటన్‌ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. బటన్‌ నొక్కగానే కేవలం 10 సెకన్లలోనే రూఫ్‌ టాప్‌ తెరుచుకుంటుంది. 

Also Read: లాల్ సలామ్ రివ్యూ: రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా? సినిమా ఎలా ఉంది?

సేఫ్టీ ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

ఈ బీఎండబ్ల్యూ Z4 M40i కారులో ఎకో ప్రో, కంఫర్ట్‌, స్పోర్ట్‌ వంటి మూడు డ్రైవింగ్‌ మోడ్‌లను కూడా ఉన్నాయి. అంతేకాదు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఫ్రంట్‌ అండ్‌ సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్‌ అసిస్ట్‌తో కూడిన ABS, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ ఇమ్మబిలైజర్‌ మరియు క్రాష్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే 7.0 వెర్షన్‌తో కూడిన 10.25 అంగుళాల హై రిజల్యూషన్‌ టచ్‌స్క్రీన్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 10.25 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 3D మ్యాప్‌లతో కూడిన GPS సిస్టమ్‌, బీఎండబ్ల్యూ లైవ్‌ కాక్‌పిట్‌, ఆపిల్‌ కార్‌ ప్లే, పార్కింగ్‌తో పాటు డ్రైవింగ్‌ అసిస్టెంట్‌ ఫంక్షన్‌ కూడా ఉంది. ఆటో స్టార్ట్‌- స్టాప్‌, బ్రేక్‌ ఎనర్జీ రిజనరేషన్‌ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget