అన్వేషించండి

Lal Salaam Review: లాల్ సలామ్ రివ్యూ: రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా? సినిమా ఎలా ఉంది?

Lal Salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ తర్వాత నటించిన ‘లాల్ సలామ్’ ఎలా ఉంది?

Lal Salaam Review
సినిమా రివ్యూ: లాల్ సలామ్ (తమిళ డబ్)
రేటింగ్: 2/5
నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత రాజశేఖర్, సెంథిల్ తదితరులు 
కథ, ఛాయాగ్రహణం: విష్ణు రంగసామి
రచన: విష్ణు రంగసామి, ఐశ్వర్య రజనీకాంత్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్
విడుదల తేదీ: ఫిబ్రవరి 9, 2024 (తెలుగులో)

సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది ‘జైలర్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఎన్నో ఫ్లాపులు, డిజాస్టర్ల తర్వాత రజనీ మార్కెట్‌ను మళ్లీ తీసుకువచ్చిన సినిమా అది. ‘జైలర్’ తర్వాత రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన సినిమా ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ ఎక్స్‌టెండెడ్ కామియోలో నటించారని చిత్ర బృందం ప్రచారంలో పేర్కొంది. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది?

కథ: 1993లో జరిగే కథ ఇది. కసుమూరు అనే ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ఐకమత్యంగా కలిసి ఉండేవారు. కానీ మొయిద్దీన్ (రజినీ కాంత్) కొడుకు శంషుద్దీన్‌ను (విక్రాంత్)ను గురు (విష్ణు విశాల్) కొట్టడంతో రెండు మతాల వారి మధ్య గొడవలు వస్తాయి. ఒకప్పుడు గురు (విష్ణు విశాల్) తండ్రి (ఫిలిప్ లివింగ్‌స్టోన్ జోన్స్), మొయిద్దీన్ భాయ్ (రజనీకాంత్) ప్రాణ స్నేహితులు. గురు ఇంటిని కూడా తగలబెట్టేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? గురు, శంషుద్దీన్‌ల మధ్య గొడవకు అసలు కారణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:‘లాల్ సలామ్’ ముందు నుంచి ప్రచారం జరిగినట్లు బోల్డ్ సబ్జెక్ట్ ఏమీ కాదు. కలిసి మెలిసి ఉంటున్న రెండు మతాల వారి మధ్య కొందరు రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం చిచ్చు పెడతారు. కానీ చివర్లో తిరిగి రెండు మతాల వారూ కలిసిపోతారు. క్లుప్తంగా ఇదే కథ. రజనీకాంత్ పోషించిన మొయిద్దీన్ పాత్ర వివాదాస్పదంగా ఉంటుందని ప్రచారంలో పేర్కొన్నారు. కానీ సినిమాలో అది ఒక పవర్‌ఫుల్ పాత్ర మాత్రమే. చివర్లో హిందువుల దేవత విగ్రహాన్ని ఎత్తడం తప్ప ఎక్కడా అవుట్ ఆఫ్ ది బాక్స్, బోల్డ్‌గా ఆ పాత్ర కనిపించదు. డైలాగ్స్ కూడా అంత పదునుగా లేవు.

సినిమా చాలా ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. ఒక ఊరి ఓట్ల కోసం రాజకీయ నాయకుల ఎత్తులు, ఊరి ప్రజల నుంచి విష్ణు విశాల్ తప్పించుకోవడానికి ప్రయత్నించడం వంటివి చూశాక అసలు ఏం జరిగి ఉంటుందని ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆ ఆసక్తి చచ్చిపోవడానికి ఎంతో సేపు పట్టదు. ఎందుకంటే అక్కడి నుంచి కథ ఏమాత్రం ముందుకు సాగదు. ప్రథమార్థంలో వచ్చే హీరోయిన్ లవ్ ట్రాక్, సాంగ్‌‌కు కథకు ఏమాత్రం సంబంధం ఉండదు. అలా అని దాన్ని బాగా తెరకెక్కించారా? అంటే అది కూడా లేదు. జాతర కోసం వేరే ఊరి నుంచి అరువు తెచ్చుకున్న రథాన్ని (తేరు) జాతర మధ్యలోనే తీసుకువెళ్లిపోవడంతో ఇంటర్వల్ కార్డు పడుతుంది.

సెకండాఫ్ ఎక్కువగా రథం చుట్టూనే తిరుగుతుంది. విష్ణు విశాల్ తను ప్రయోజకుడ్ని అని నిరూపించుకోవాలంటే ఊరికి రథం తేవాల్సిందేనని ఫిక్స్ అవుతాడు. రథం తీసుకురావడం అంతకు ముందు అతని కారణంగా ఊరికి జరిగిన నష్టాన్ని ఎలా మర్చిపోతారో అర్థం కాదు. అన్నిటికంటే దారుణం అనిపించే విషయం ఏంటంటే గొడవ తర్వాత విష్ణు విశాల్ ఊరిలోకి వచ్చేటప్పుడు జీవిత (విష్ణు విశాల్ తల్లి పాత్రధారి) బయటకు వచ్చి ‘నువ్వు చచ్చిపోతే నేను సంతోషిస్తాన్రా’ అని హెవీ ఎమోషనల్ డైలాగులు చెప్తారు. కానీ కొన్నాళ్లకే విష్ణు విశాల్ డబ్బులు సంపాదించి రథం రెడీ చేస్తున్నప్పుడు సంతోషించినట్లు చూపిస్తారు. తల్లి ప్రేమను, డబ్బుతో ముడి పెట్టడం ఏంటో తీసినోళ్లకే తెలియాలి. క్లైమ్యాక్స్‌లో ఏం జరుగుతుందో కూడా ముందే ఊహించడం పెద్ద కష్టం కాదు. కొన్ని డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ‘బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం’ లాంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి.

మొదటిగా ‘లాల్ సలామ్’లో రజనీకాంత్‌ది ఎక్స్‌టెండెడ్ క్యామియో అని ప్రచారం చేశారు. కానీ ఈ నిడివి కాస్త తక్కువ ఉన్న ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. సినిమా చూశాక విక్రాంత్ కంటే రజనీకాంత్‌కే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంది కదా అని కూడా అనిపిస్తుంది. రెండున్నర గంటల సినిమాలో గంట వరకు స్క్రీన్ టైమ్ ఉంది. నిజానికి ఈ సినిమాలో అసలైన క్యామియో హీరోయిన్ అనంతిక శానిల్‌కుమార్‌ది. ప్రథమార్థంలో ఇంట్రడక్షన్ సీన్, ఒక పాట, జాతరలో కొన్ని షాట్లు, ఆ తర్వాత ఒక సీన్, కట్ చేస్తే మళ్లీ క్లైమ్యాక్స్‌లో మళ్లీ చిన్న సీన్ అంతే. ప్రాధాన్యత లేనప్పుడు పాత్రనే రాసుకోకుండా ఉంటే బాగుండేది. కొత్తగా ప్రయత్నిస్తున్నాం అని తీసేవాళ్లకే కాకుండా చూసేవాళ్లకి కూడా అనిపించాలంటే ఇలాంటివి అవాయిడ్ చేయాల్సిందే. కపిల్ దేవ్ క్యామియోకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆయన స్థానంలో ఏ క్యారెక్టర్ ఆర్టిస్టును తీసుకున్నా ఇంపాక్ట్‌లో పెద్దగా తేడా ఉండేది కాదు.

ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అతి పెద్ద మైనస్. కనీసం ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. ఇక నేపథ్య సంగీతం గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్క సన్నివేశాన్ని కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. చాలా వరకు రియల్ లొకేషన్లలోనే ఈ సినిమాను తెరకెక్కించారు. రజనీ లాంటి స్టార్‌ను పెట్టుకుని కూడా ఈ ప్రయత్నం చేశారంటే మాత్రం అభినందించదగ్గ విషయమే.

Also Readరవితేజ 'ఈగల్' సినిమాకు సీక్వెల్ - టైటిల్ కూడా ఫిక్స్!

నటీనటుల ఎంపికలో మాత్రం ఐశ్వర్య రజనీకాంత్‌కు 100కు 100 మార్కులు ఇవ్వవచ్చు. ఒకప్పుడు రజనీకాంత్‌తో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తర్వాత తెర మరుగైపోయిన ఫిలిప్ లివింగ్‌స్టోన్ జోన్స్, సెంథిల్ వంటి నటులను మళ్లీ చూడటం కాస్త నోస్టాల్జిక్‌గా ఉంటుంది. సెంథిల్‌కు నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర కూడా దొరికింది. స్వతహాగా మంచి నటుడు అయిన సెంథిల్ ఈ పాత్రలో బాగా నటించారు. కానీ సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే మాత్రం విష్ణు విశాల్ తల్లి పాత్రలో నటించిన జీవితా రాజశేఖర్‌దే. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. ఇప్పటి తరం వారికి జీవితను ఇలా చూడటం కొత్తగా ఉంటుంది. రజనీకాంత్‌కు ఇలాంటి పాత్రలు పోషించడం కొత్తేమీ కాదు. విష్ణు విశాల్, విక్రాంత్ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకుంటారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... రజనీకాంత్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు కూడా ‘లాల్ సలామ్’ను చూడటం కష్టమే.

Also Read'ఈగల్' ఆడియన్స్ రివ్యూ: ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Embed widget