Eagle Sequel: రవితేజ 'ఈగల్' సినిమాకు సీక్వెల్ - టైటిల్ కూడా ఫిక్స్!
Eagle Movie Sequel: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఈగల్'కు సీక్వెల్ తీయాలని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అది ఏమిటో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఈగల్'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. దీనికి సీక్వెల్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. 'ఈగల్' మూవీ ఎండింగ్‌లో అనౌన్స్ చేశారు అది ఏమిటో తెలుసా?
'ఈగల్'కు సీక్వెల్... 'యుద్ధకాండ'గా పార్ట్ 2
Eagle movie sequel titled Eagle Part 2 Yuddha Kaanda: 'ఈగల్' సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని గానీ, లేదంటే సీక్వెల్ చేస్తామని గానీ విడుదలకు ముందు హీరో రవితేజతో పాటు యూనిట్ సభ్యులు ఎవరు చెప్పలేదు. అయితే... ఈ రోజు థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు సినిమా చివర్లో సర్‌ప్రైజ్ ఇచ్చారు. పార్ట్ 2 ఉందని చెప్పారు.
'ఈగల్' సీక్వెల్‌కు 'ఈగల్ 2 - యుద్ధకాండ' అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో హీరో రవితేజ పేరు సహదేవ్ వర్మ. అతని ప్రయాణం ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నమాట. మరి, సీక్వెల్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో?
Directors should refrain from announcing part 2 for every movie they make because it negatively impacts the reception of the first installment. Instead, directors should prioritize ensuring that part 1 resonates with audiences both critically and commercially #Eagle #raviteja
— non sync (@sterns_haschen) February 8, 2024
Eagle movie cast and crew: సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఇందులో అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, మధుబాల తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మణిబాబు డైలాగులు రాశారు. డేవ్ జాండ్ సంగీతం అందించారు.
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ఈగల్' కంటే ముందు హీరోతో 'ధమాకా' చేశారు. హీరో, నిర్మాత... ఇద్దరూ మా కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావాలని అనుకుంటున్నట్లు ఇంతకు ముందు చెప్పారు. 'ఈగల్ 2'ను కూడా చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. సినిమా టాక్ అండ్ బిజినెస్ బట్టి కూడా డిసైడ్ అవుతుంది.
Also Read: 'ఈగల్' ఆడియన్స్ రివ్యూ: ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే...
రవితేజ 'కిక్ 2' చేశారు గానీ...
రవితేజ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో రెండో పార్ట్ వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. 'కిక్' సీక్వెల్ 'కిక్ 2' చేశారు. అయితే... అందులో సేమ్ క్యారెక్టర్ కాదు. 'కిక్'లో హీరో కిక్ కోసం వెతికితే... సీక్వెల్ 'కిక్ 2'లో మొదటి పార్ట్ హీరో కొడుకు కంఫర్ట్ అంటూ వచ్చాడు. 'ఈగల్'లో మాత్రం సేమ్ క్యారెక్టర్ సీక్వెల్‌లో కూడా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు.
Also Read: 'ఈగల్'ను ఎన్ని కోట్లకు అమ్మారు? రవితేజ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?