అన్వేషించండి

Eagle Twitter Review - 'ఈగల్' ఆడియన్స్ రివ్యూ: ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే... సినిమా హిట్టా? ఫట్టా?

Eagle Movie Review: యూకేతో పాటు విదేశాల్లోని కొన్ని లొకేషన్లలో 'ఈగల్' ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఎన్నారై ఆడియన్స్ సినిమా చూసి ఏం చెబుతున్నారో చూడండి.

Eagle review starring Ravi Teja: మాస్ మహారాజా రవితేజ మొండి మోతుబరిగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఈగల్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యూకేతో పాటు ఫారిన్ లొకేషన్స్ కొన్నిటిలో ముందుగా ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చూసిన ఎన్నారై ఆడియన్స్ ఏం చెబుతున్నారు? సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉంది? అనేది ట్విట్టర్ రివ్యూలో చూడండి.

అబ్బాయిలూ... నాలుగు బస్తాల పేపర్లు తీసుకెళ్ళండమ్మా!
రవితేజ లుక్స్, సినిమా సూపర్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇంకా అతను ''దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఇచ్చి పడేశాడు. సూపర్ సినిమా తీశాడు. రవితేజ ఫ్యాన్స్... సెలబ్రేషన్స్ కోసం మీరు ఎంతైనా ఖర్చు చేసుకోండి. మీరు తీసుకువెళ్లే పేపర్లు ఫస్టాఫ్ అయ్యేసరికి అయిపోతాయి. సెకండాఫ్ కోసం ఇంకో నాలుగు బస్తాల పేపర్లు ఎక్కువ తీసుకువెళ్ళండి'' అని పేర్కొన్నారు.

'కెజియఫ్' స్ఫూర్తితో... స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులతో!
హీరో ఎలివేషన్ సీన్లు, ఆ బిల్డప్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు చూస్తుంటే 'కెజియఫ్' ఇన్స్పిరేషన్ కనబడుతోందని మరొకరు ట్వీట్ చేశారు. అయితే... కథ కన్వీన్సింగ్‌గా లేదన్నారు. ''రవితేజ తన పాత్రకు న్యాయం చేశారు. అజయ్ ఘోష్ కామెడీ రిలీఫ్ ఇచ్చింది. అనుపమా పరమేశ్వరన్ ఇంప్రెసివ్ గా ఉన్నారు. అతిథి పాత్రలో కావ్య థాపర్ మెరిశారు. డీసెంట్ కాన్సెప్ట్ తో మూవీ తీశారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే ఇంకా బావుండేది'' అని పేర్కొన్నారు. సినిమాలో నేపథ్య సంగీతం హైలైట్ అని ఇంకొకరు పేర్కొన్నారు.

Also Read: 'యాత్ర 2' థియేటర్‌లో కొట్టుకున్న పవన్, జగన్ ఫ్యాన్స్... గొడవ తర్వాత ఏం జరిగిందంటే?

'మార్గశిరం మధ్య రాత్రి రవి అన్న హిట్టు బొమ్మ' అని ఒక అభిమాని తన సంతోషం వ్యక్తం చేశారు. 'ఈగల్'లో వన్ మ్యాన్ షో చేశారని, రవితేజ ఊచకోత, ఆ ఎలివేషన్స్, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బావున్నాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కి ఇటువంటి ఫైట్స్ పడితే సూపర్ ఉండేదది ఇంకొకరు ట్వీట్ చేశారు.   

బిలో ఏవరేజ్ ఫస్టాఫ్... ఏవరేజ్ సెకండాఫ్!
సోషల్ మీడియాలో 'ఈగల్'కు నెగిటివ్ టాక్ ఉంది. మొత్తం మీద మిక్స్డ్ టాక్ ఉందని చెప్పవచ్చు. ఒక నెటిజన్ 'బిలో ఏవరేజ్ ఫస్టాఫ్... ఏవరేజ్ సెకండాఫ్! రవితేజ బెస్ట్ ఇచ్చారు. ఎలివేషన్లు చాలా ఎక్కువ ఉన్నాయి. నేపథ్య సంగీతం ఫ్లాట్ గా సాగింది. పార్ట్ 2 కోసం సెటప్ చేశారు'' అని ట్వీట్ చేశారు.

Also Read: 'ఈగల్'ను ఎన్ని కోట్లకు అమ్మారు? రవితేజ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

'ఈగల్' ట్విట్టర్ రివ్యూలు, ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూడండి. సోషల్ మీడియాలో కొందరు చేసిన పోస్టులు మీకోసం...

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Live Updates: 'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
Jailer 2 OTT : ఆ ఓటీటీలోకి జైలర్ 2 - రజనీ కాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి జైలర్ 2 - రజనీ కాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్

వీడియోలు

1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget