Ileana Babymoon : డెలివరీకి ముందు పార్ట్‌నర్‌తో హాలిడేకి వెళ్లిన ఇలియానా!
Ileana vacation with partner ahead delivery : ఇప్పుడు ఇలియానా బేబీ మూన్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా గర్భవతి. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో సగర్వంగా ఆమె ప్రకటించారు. బేబీ బంప్ ఫొటోస్ కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు బేబీ మూన్ ఎంజాయ్ చేస్తున్నారు ఆమె. హనీమూన్ అంటే చాలా మందికి తెలుసు. వివాహమైన తర్వాత కొత్త జంట వేసే ట్రిప్! మరి, బేబీ మూన్ అంటే ఏమిటి? అంటే బిడ్డ పుట్టడాని (డెలివరీ)కి ముందు కపుల్ వేసే ట్రిప్ అన్నమాట!
సముద్ర తీరంలో ఇలియానా & పార్ట్నర్!
ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచి ఆమెపై విమర్శల జడివాన మొదలైంది. ఎందుకంటే... తనకు పెళ్లైనట్టు ఎప్పుడూ ఆమె ప్రకటించలేదు. ప్రేమలో ఉన్నట్టు కూడా చెప్పలేదు. కానీ, కట్రీనా కైఫ్ సోదరుడితో డేటింగ్ చేస్తున్న విషయం ప్రేక్షకులకూ తెలుసు. దాంతో 'పెళ్లి కాకుండా తల్లి ఎలా అవుతున్నావు? ఇది సంప్రదాయమేనా?' అని ఆమెను ప్రశ్నించారు కొందరు. 'నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు?' అంటూ కొంత మంది దారుణంగా, చాలా నీచంగా కామెంట్స్ చేశారు.
విమర్శలను ఇలియానా పట్టించుకోవడం లేదు. హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ సముద్ర తీరంలో ఉన్నారామె. బేబీ మూన్ అంటే పార్ట్‌నర్‌తో కలిసి వెళతారు. తన పార్ట్‌నర్ ఎవరు? బిడ్డకు తండ్రి ఎవరు? అనేది అధికారికంగా చెప్పలేదు. కానీ, ఇలియానా హ్యాపీగా ఉన్నారని మాత్రం అర్థం అవుతోంది.
Also Read : 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?
ఇలియానా బేబీ బంప్ చూశారా?
Ileana Baby Bump Alert : 'బంప్ అలర్ట్' అంటూ సోషల్ మీడియాలో ఇలియానా మూడు ఫోటోలు పోస్ట్ చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఆ ఫోటోలు దిగినట్లు చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. అంత కంటే స్పష్టంగా ఆ ఫొటోల్లో ఇలియానా బేబీ బంప్ కనబడుతోంది. ఆ ఫోటోలను హీరోయిన్ అన్యా సింగ్ తీశారు. తెలుగులో సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేను' సినిమాలో నటించారామె!
Also Read : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!
View this post on Instagram
ప్రెగ్నెంట్ అని ఇలియానా ఎలా చెప్పారంటే?
'అండ్ సో ద అడ్వెంచర్ బిగిన్స్' (ఇప్పటి నుంచి సాహసయాత్ర మొదలు అయ్యింది) - ఈ కొటేషన్ రాసిన ఉన్న టీ షర్టును ఏప్రిల్ 18న ఇలియానా పోస్ట్ చేశారు. ఆ తర్వాత మెడలో 'అమ్మ' (Mama) అని రాసి ఉన్న చైన్ ధరించిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ రెండూ చూస్తే ఆమె గర్భవతి అని చెప్పడం పెద్ద కష్టం ఏమీ కాదు. ''త్వరలో వస్తుంది. నా లిటిల్ డార్లింగ్ ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలియానాకు సినిమా పరిశ్రమలో పలువురు కంగ్రాట్స్ చెప్పారు.
కట్రీనాకు కాబోయే మరదలు ఇలియానా!
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఏమైందో? ఏమో? బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ 'మల్లీశ్వరి', నందమూరి బాలకృష్ణ 'అల్లరి పిడుగు' సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కట్రీనా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ లారెంట్ మైఖేల్ (Sebastian Laurent Michel)కు ఇలియానా దగ్గర అయ్యారు. 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రాంలో కట్రీనా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.