By: ABP Desam | Updated at : 31 May 2023 03:43 PM (IST)
టర్కీలో సమంత
'పుష్ప' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'తగ్గేదే లే' అంటూ చెప్పిన డైలాగ్, ఆ మ్యానరిజమ్ ఎంతో పాపులర్ అయ్యింది. స్టార్ హీరోయిన్, తన నటనతో పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సమంత నిజ జీవితంలో చేసే ఖర్చు చూస్తే ఆ మాట అనాలేమో!? ఖర్చు విషయంలో ఆమె ఎక్కడా తగ్గడం లేదు. కాస్ట్లీ చెప్పులు, గౌనులు ధరిస్తూ 'ఔరా' అంటూ ప్రేక్షకులు నోరెళ్ళ బెట్టేలా చేస్తున్నారు.
సమంత గౌను... లక్షన్నర రేటు!
ప్రస్తుతం సమంత (Samantha) టర్కీలో ఉన్నారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న తాజా సినిమా 'ఖుషి' పాట చిత్రీకరణ చేస్తున్నారు. అక్కడ ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుసుగా... హీరోలు హీరోయిన్లు ఫోటోలు పోస్ట్ చేస్తే వాళ్ళ డ్రస్, షూలు, వాచ్ వంటి వాటి రేటు కోసం ఎంక్వైరీ చేసే అభిమానులు ఉంటారని!
సమంత గౌను గురించి కొందరు నెట్టింట సెర్చ్ చేశారు. దాని రేటు ఎంత ఉందో తెలుసా? అక్షరాలా లక్షన్నర రూపాయలు! 'ఖుషి' సాంగ్ షూటింగ్ కోసం టర్కీ వెళ్లేముందు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సమంత కనిపించారు. అప్పుడు వేసుకున్న చెప్పుల రేటు చూస్తే రెండున్నర లక్షలు ఉంది. బ్రాండ్స్ విషయంలో సమంత 'తగ్గేదే లే' పాలసీ ఫాలో అవుతున్నారు.
Also Read : పెద కాపు - శ్రీకాంత్ అడ్డాల - సీఎం సీనియర్ ఎన్టీఆర్
పూజా హెగ్డే స్టైల్ సామ్ కాపీ కొట్టిందా?
సమంత వేసుకున్న గౌను ఉంది చూశారా? ఈ స్టైల్ గౌను సామ్ కంటే పూజా హెగ్డే వేసుకున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జోడీగా బుట్ట బొమ్మ నటించిన సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'. ముంబైలో జరిగిన ఆ సినిమా ప్రచార కార్యక్రమానికి పూజా హెగ్డే కూడా సేమ్ టు సేమ్ ఈ స్టైల్ గౌను ధరించారు. కాకపోతే, ఆమెది ఎల్లో గౌను. సమంత ధరించినది గ్రీన్ గౌను! 'ఖుషి' పాటలో సమంత ఈ గౌనుతో కనిపిస్తారు ఏమో!?
ముస్లిం అమ్మాయి... ఐటీ ఉద్యోగి!
ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమాల్లో 'ఖుషి' ఒకటి. ఆమె పుట్టిన రోజు కానుకగా చిత్ర బృందం ఓ స్టిల్ విడుదల చేసింది. అందులో ఆమెను చూస్తే... ఐటీ ఉద్యోగి పాత్ర చేస్తున్నారని ఈజీగా చెప్పవచ్చు. అంతకు ముందు విడుదల చేసిన స్టిల్స్ చూస్తే కశ్మీరీ ముస్లిం యువతిగా కనిపించారు. మరి, ఆ ముస్లిం యువతి ఐటీ ఉద్యోగి కావడం వెనుక ఏమైనా ట్విస్ట్ ఉందా? లేదా? అనేది సినిమా వస్తే గానీ తెలియదు. విశేషం ఏమిటంటే... ఆ స్టిల్ చూశాక, చాలా మందికి తెలుగులో సమంత తొలి సినిమా 'ఏ మాయ చేసావె' గుర్తుకు వస్తోంది. ఆ సినిమాలో సమంత ఐటీ ఉద్యోగి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో ఉద్యోగిగా కనిపించారు. అయితే, 'ఏ మాయ చేసావె' తర్వాత మళ్ళీ పూర్తిస్థాయి ఐటీ ఉద్యోగి పాత్ర చేయడం 'ఖుషి'లోనే అనుకుంట!
Also Read : తక్కువ అంచనా వేయకండి - 'బడ్డీ'తో బాక్సాఫీస్‌కు గురి పెట్టిన అల్లు శిరీష్!
Ayalaan Movie: అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ, ఆరు గంటల పాటు ప్రశ్నల వర్షం !
‘భక్త కన్నప్ప’లో నయన్, విరాట్ బయోపిక్‌లో రామ్ పోతినేని - నేటి టాప్ సినీ విశేషాలివే!
Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?
Akhil Akkineni : తమిళ దర్శకుడితో అఖిల్ అక్కినేని సినిమా?
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
/body>